వరిలో కాండం తొలుపు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో కాండం తొలుపు పురుగు
పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.
- 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:
- ట్రైకోడ్రామా బ్రెసిలియెన్సిస్, టెలినోమస్ ఫెలిఫెసిమెన్స్ కార్డులు వాణిజ్య పరంగా లభిస్తున్నాయి. ఇవి కాండంతొలుచు పురుగుల గుడ్ల సముదాయాన్ని నాశనం చేస్తాయి.
- పెద్ద మగ పురుగులను ఫెరమోన్ ఎరలను ఉపయోగించి ఆకర్షించి ఎరలు పడేటట్లు చేయవచ్చు.
- పసుపు దుంప కషాయాన్ని పిచికారీ చేయాలి.
- పొలంలో రెక్కల పురుగులను కాని, పురుగు గుడ్లను కాని గమనించిన వెంటనే 5శాతం వేప కషాయాన్ని పిచికారి చేసి గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చు.