వరిలో ఆకు చుట్టు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో ఆకు చుట్టు పురుగు
పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మొక్కలను సరియైన దూరంగా నాటాలి.
- పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.
- 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ :
- పొలంపై ఒక ముళ్ళ కంపని లాగుతూ వెళ్ళడం వలన ఆకుముడతలు విడిపోయి లార్వా నీటిలో పడి చనిపోతుంది.
- రెక్కల పురుగులను గమనించినప్పుడు 5శాతం వేప కషాయం పిచికారి చేయాలి.
- లార్వా చిన్న దశలో అదుపు చేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పిచికారి చేయాలి.