వరిలో ఆకు చుట్టు పురుగు
వరిలో ఆకు చుట్టు పురుగు
పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొక్కలను సరియైన దూరంగా నాటాలి.
పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.
8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ :
పొలంపై ఒక ముళ్ళ కంపని లాగుతూ వెళ్ళడం వలన ఆకుముడతలు విడిపోయి లార్వా నీటిలో పడి చనిపోతుంది.
రెక్కల పురుగులను గమనించినప్పుడు 5శాతం వేప కషాయం పిచికారి చేయాలి.
లార్వా చిన్న దశలో అదుపు చేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పిచికారి చేయాలి.