వన్నెల వరి – డా|| జి.వి. రామాంజనేయులు
‘దొడ్డుబియ్యం మంచిదా? సన్నబియ్యం మంచిదా?’, ‘తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా?’, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడి నిచ్చే వంగడాలు మంచివా? రైతుల్ని, వినియోగదారులను రోజు వేధించే ప్రశ్నలు. బియ్యంలో ఏమి పోషకాలు లేవు, లావు పెరగటానికి వరిబియ్యం ముఖ్య కారణం అని కొందరు, ఉత్పత్తిలో అధిక నీరు తీసుకోవటంతో పర్యావరణ సమస్యలు ఎక్కువ అని కొందరు, అస్సలు వరి మానేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అని కొందరు అంటున్న సమయంలో మన దేశం లో వరి పంట గురించి, పంట రకాల గురించి, బియ్యం చేసే విధానాల గురించి, ఎవరు ఎన్ని మాట్లాడినా రైతులు వరి పండిచటం కానీ, వినియోగ దారులు వరి బియ్యం తినటం కానీ ఎందుకు మానలేక పోతున్నారో తెలుసుకోవటం ముఖ్యం.
‘దొడ్డు బియ్యం’ అంత మంచివైతే ఇన్నాళ్ళూ వాటిని ఎందుకు మరిచి పోయారని, మా చిన్నప్పుడు అనేక రకాల బియ్యం తినేవాళ్లం అని, ఎర్రబియ్యం ఎంతో ఆరోగ్యకరమని, సువాసనలు వెదజల్లే ‘చిట్టి ముత్యాల’ అన్నం కలుపుకుని తింటే నేతితో కలుపుకున్నంత రుచిగా ఉండేదని పెద్దవాళ్ళు గుర్తు చేసుకోవడం విని మరి అవన్నీ ఏమైపోయాయని చాలా మందికి అనుమానం వచ్చింది.
దీనికి తోడు బియ్యంలో కేవలం ‘పిండి పదార్థాలు’ (కార్బోహైడ్రేట్స్) మాత్రమే ఉంటాయని, డయాబెటిస్ వున్నవారు ‘బియ్యం పదార్థాలు’ తగ్గించుకోవాలనడంతో అసలు బియ్యంలో ఉన్న పోషకాలు ఏమిటి, దానిలో పిండి పదార్ధాలు తప్ప మరేం లేవా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో వరి ఎదుర్కొంటున్న సమస్యలు, వరి విషయంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించే ఈ నెల కవర్ స్టోరీ.
వరి అన్ని ఆసియా దేశాల ప్రజల ముఖ్య ఆహారం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వరిలో 92 శాతం ఈ ప్రాంతంలోనే అవుతుంది. అందులో 90 శాతం ఇక్కడే వినియోగమవుతుంది కూడా. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆహారం కోసం, జీవనోపాధి కోసం వరి మీద ఆధారపడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మన దేశంలో అయితే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వరే ముఖ్య పంట. ముఖ్యమైన ఆహారం కూడా. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరి కారణంగా ‘అన్నపూర్ణ’గా పేరు తెచ్చుకుంది.
లక్షకు పైగా రకాలు
జన్యు వైవిధ్యం ఎక్కువగా ఉన్న పంటలలో వరి ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా వరి రకాలు ఉన్నాయని గుర్తించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 50 వేల రకాలకు పైగా సాగులో ఉన్నాయని నివేదికలు చెపుతున్నాయి. అయితే మన రైతులకి వంగడాల గురించి రాసిపెట్టుకోవడం అలవాటు లేకపోవడం వలన ఇంకా కొన్ని వేల రకాలు ఆ నివేదికలలోకి రాకపోయి వుండవచ్చని అంచనా. ఆసియా ఖండంలో పండే వరిలో మూడు ప్రాంతీయ రకాలు ఉన్నాయి. ఇవి ఇండికా, జపానికా, జవానికాలు. ప్రకృతిలో పరిణామాల ప్రభావంతోనూ, తమ ప్రాంతానికి, వనరులకి, ఆహారపు అలవాట్లకు, రుచులకు అనుగుణంగా రైతులు చేసుకున్న ఎంపిక వల్లనూ ఈ వైవిధ్యం ఏర్పడింది. ముఖ్యంగా వరి తినే విధానాన్ని బట్టి ఈ ఎంపిక సాగింది. ఈ వరి రకాల్లో వ్యత్యాసం ముఖ్యంగా గింజలలోని పిండి పదార్థం యొక్క భౌతిక, రసాయనిక లక్షణాల వలన ఏర్పడింది. పిండి పదార్థాలలో ఉండే ఈ వ్యత్యాసాల వలనే వండిన తర్వాత అన్నం పొడిగా ఉండడం లేదా జిగటగా ఉండడం జరుగుతుంది. జపానికా రకాలలో అమైలోజ్ తక్కువగా (దాదాపు 15 శాతం) ఉంటుంది. దీని వలన వండినపుడు అవి మెత్తగా అయిపోయి జిగటగా ఉంటాయి. తూర్పు ఆసియాలో ఇవి ఎక్కువగా పండిస్తారు. వాడతారు. మనదేశంలో పండే ఇండికా రకాలలో అమైలోజ్ (దాదాపు 20 శాతం) ఎక్కువ ఉంటుంది. దాని వల్లే అన్నం పొడిగా వస్తుంది.
వన్నెల వరి
వరి గింజలోని పై పొరలో ఉండే ‘ఆంత్రోసైనిన్’ అనే పిగ్మెంట్ వలన అనేక రంగుల వరి రకాలను మనం చూడవచ్చు. ఎరువు, ఊదా రంగుల నుండి గోధుమ, నలుపు వరకు రకరకాల రంగుల్లో వడ్లు పండుతాయి. మిల్లింగ్ జరిగేటప్పుడు ఈ బియ్యం పై పొర తీసివేస్తే లోపల గింజ చాలా వరి రకాలలోనూ తెల్లగానే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలోనూ ఎన్నో రకాలు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలో చిన్నంగి, నల్గొండ జిల్లాలో ఎర్రబియ్యం ‘గొట్టెలు’ చాలా మంది ఇష్టంగా తింటారు. విశాఖ మన్నెంలో నల్ల వడ్లు, ఇసుక రవ్వలు నేటికీ పండిస్తున్నారు. అయితే వినియోగదారులు ఎక్కువగా పాలిష్ చేసి తెల్లగా ఉండే బియ్యాన్నే ఇష్టపడడం వలన గింజ పై పొర తీసివేసి అమ్మడం జరుగుతోంది. దీనివలన రంగుతో పాటు ఎంతో విలువైన పోషకాలు కోల్పోతున్నాం మనం. ఎరుపు వరి రకాలలో ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 2, 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి.
ప్రతి ధాన్యపు గింజ లో రెండు బియ్యపు గింజలు వుండే ‘జుగల్’ రకం, మూడు బియ్యపు గింజలు వుండే ‘సౌతేన్’ రకం మన దేశం లో ఒకప్పుడు ఉండేవి. అలాగే చల్ల నీళ్ళల్లో వేయగానే తినటానికి వీలుగా అయ్యే రకం వరి అస్సాం లో వుంది.
అయితే ఈ రంగులు కేవలం గింజలల్లో మాత్రమే కాకుండా, ఆకుల్లో కూడా అనేక రంగుల వరి రకాలు వున్నాయి. జపాన్ దేశంలో అయితే పొలంలో అనేక రకాల వరి రకాలు పొలంలో వేసుకునేటప్పుడు రకరకాల డిజైన్ లు వచ్చేలా, వాటిల్లో పోటీలు నిర్వహించుకోవటం చేస్తారు. చైనా దేశంలో యున్నాన్ రాష్త్రం లో కొండ వాలు పైన మడులు చేసి పండించే అలవాటు వుంది. అక్కడి రైతులందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం అనేక రకాల వరి పండించటం వలన చూడటానికి దేశ విదేశాల నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. అలాగే గింజ ఆకారం లో కూడా బాగా పొడవు గింజ వుండే బాసుమతి రకాలతో పాటు, చిన్న సన్న రకాలు, గుండ్రటి రకాలు అనేకం వున్నాయి.
సువాసనల వరి:
రంగులు, అకారాలే కాక వరి పంటలో అనేక రకాల సువాసన రకాలు కూడా వున్నాయి. అన్నీ ప్రత్యేక సువాసనలు కలిగిన రకాలే. సుమతి, బాసుమతి లాంటి రకాలే కాక జీరా వరి, చిట్టి ముత్యాలు వంటి రకాలు అనేకం వున్నాయి.
ఆరోగ్యదాయక వరి
అలాగే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే వరి రకాలు వున్నాయి. కేరళ రాష్ట్రము లో ‘నవారా’, తమిళ్ నాడు లో ‘మాప్పిళ్లై’ రకాలు మగ వాళ్ళల్లో ‘ఫెర్టిలిటీ పెంచుతాయని చెపుతారు.. అలాగే గర్భవతులకి ఎక్కువ ఐరన్ అందించే రకాలు వున్నాయి.
అన్ని నేలల్లోనూ పండుతుంది
వరి పంట అనేక ప్రత్యేకతలు కలిగినది. మైదాన ప్రాంతాలలోనూ, కొండలమీదా, పూర్తిగా నీటిలోనూ, పూర్తిగా వర్షాధారంగానూ కూడా పండే పంట ఇది. వరి నీటి మొక్క కాదు. అయితే నీటిని తట్టుకునే మొక్క. కలుపు నివారణ కోసం నీరు పెట్టడం జరుగుతోంది. ప్రతి పరిస్థితికీ అనువైన రకాలు తరతరాలుగా రైతులు ఎంచుకుని సాగు చేసుకుంటున్నారు. నీటి ముంపుకు గురి అయ్యే ప్రాంతాలలో నీటి మట్టంతో పాటు పెరిగే రకాలు నేటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సాగులో ఉన్నాయి. ఈ రకం వరి ఒకే రోజు 1-2 అడుగులు కూడా పెరుగుతుందనేది ఎంత మందికి తెలుసు? అలాగే సముద్రతీర ప్రాంతాలలో ఉప్పునీటి కయ్యలలో పెరగగలిగే వరి రకాలూ ఉన్నాయి. సునామీ తర్వాత తమిళనాడులో అనేక తీర ప్రాంతాల పంట చేలు ఉప్పుబారిపోయినప్పుడు ఉప్పునీటిని తట్టుకునే ఈ రకాలను ఒరిస్సా రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి సేకరించి అక్కడి రైతులకు ఇచ్చి వారి పంట కోల్పోకుండా కాపాడగలిగారు.
నిజానికి నీరు నిలబడి జాలు వుండే పంట భూములను ‘ూaససవ ‘ అంటారు. అలాంటి భూములలో కూడా పండ కలిగే పంట వరి. వరి లో ఎరువులు పురుగుమందులు వాడక పోతే ఇదే నీటిలో చేపలు బాతులు పెంచుకోవచ్చు.
వరి సాగు పర్యావరణం పై ప్రభావం
నీరు కట్టి పండించే పద్దతులనే అన్ని చోట్లా ప్రోత్సహించడం వలన 1950లలో 50 శాతం పైగా వున్న మెట్ట వరి నేడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. మెట్ట ప్రాంతాలలో కూడా నీరు కట్టి పండించే పద్ధతి రావడం వల్లనే భూగర్భ జలాలు నేడు అడుగంటి పోతున్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో భూగర్భ జలాలు 800 అడుగుల కంటే కిందకి వెళ్లి పోయాయి. ఒక ఎకరంలో నీరు కట్టి పండించే వరికి సుమారుగా 60,00,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అది సుమారుగా 100 కుటుంబాలు సంవత్సర పాటు ఇంటి అవసరాల కోసం వాడే నీటితో సమానం. దీనికి తోడు నీరు నిలబెట్టి పండించే వరి వలన వాతావరణం లోకి మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది భూతాపం పెంచటంలో కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ ప్రమాదకరం.
తక్కువ నీటి వినియోగంతో పండించే ‘శ్రీ’ వరిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు మొదట్లో కనిపించినా, అధికారులు, శాస్త్రవేత్తల మధ్య ఉన్న బేధాభిప్రాయాల వలన మన రాష్ట్రంలో ఆ కార్యక్రమం నత్తనడక నడుస్తోంది. నీరు కట్టి పండించే పద్దతిలో ఒక కిలో బియ్యం పండడానికి ఐదు వేల లీటర్ల నీరు వినియోగం అవుతుంది. అంటే ఒక మనిషి సుమారు రోజుకు 200 గ్రాముల బియ్యం తింటారు అనుకుంటే వరి బియ్యం తినడం ద్వారా వెయ్యి లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడన్నమాట. ఈ లెక్కన హైదరాబాదు జనాభా ఒక పూట తినే బియ్యం పండించడానికి సుమారు ఒక పెద్ద డ్యామ్ రిజర్వాయర్ నీరు అవసరం అవుతుంది. మనం పశువుల మేతగా వరిగడ్డి మీద ఎంత ఆధారపడతామో అందరికీ తెలిసిందే. అయితే పాత వరి రకాల గడ్డిని తినినంతగా ఇప్పుడొస్తున్న ఈ అధిక దిగుబడి రకాల గడ్డిని పశువులు ఇష్టపడవు. దీనికితోడు ఈ మధ్యకాలంలో వరి కోత యంత్రాలు రావడంతో ఆ విధంగా వచ్చే గడ్డి పశువుల మేతకు అసలు పనికిరాకుండా పోతోంది. దీనివలన పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడి పశువుల్ని అమ్మివేసుకనే పరిస్థితి వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో, దేశంలో మిగితా ప్రాంతాలలో వరి యంత్రాలతో కోసిన వెంటనే భూమిలో మిగిలిన మొదల్లను తగలబెట్టటం అలవాటుగా మారింది. దీనితో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ప్రతి సంవత్సరం పంజాబ్-హర్యానా రాష్ట్రాలలో కోటి ఎకరాలకు పైగా సాగు అయ్యే వరి పంటలో 90 శాతం పొలాల్లో అక్టోబర్ – నవంబర్ నెలల్లో
మొదళ్ళు తగుల బెడుతున్నారు. దీనితో ఈ పొగ గాలి చేరి, గ్రామాలను, పట్టణాలను కమ్మేస్తోంది. పైగా అదే సమయం లో పొగ మంచు కూడా ప్రారంభం కావటం తో సమస్య ఉత్తర భారతం అంతటా పాకింది. గత కొద్ది సంవత్సరాలుగా ఢిల్లీ నగరం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఊపిరి బిగబెట్టుకొని వుండాల్సి వస్తోంది.
సగం భూమిలో సోనా మసూరే
హరిత విప్లవం తరువాత ప్రభుత్వం అధిక దిగుబడినిచ్చే కొన్ని రకాలను మాత్రమే ప్రోత్సహించడం వలన త్వరత్వరగా వరిలో వైవిధ్యం కనుమరుగైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశంలో సుమారు 50 వేల రకాలు సాగులో ఉండేవని మొదట అనుకొన్నాం కదా. అలాంటిది, నేడు దేశంలో దాదాపు 85 శాతం వరి సాగు కేవలం పది అధిక దిగుబడి రకాల మీదనే ఆధారపడి వుంది. మన రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఒకప్పుడు మసూరి, నెల్లూరు మొలకొలుకులు, గోదావరి సన్నాలు వంటి సన్న వరి రకాలు, తెలంగాణలో చిట్టి ముత్యాలు లాంటి సువాసన రకాలు, కోస్తా ప్రాంతంలో 120 రోజులలో పండే పునాస రకం, నీరు కట్టకుండా పండే ‘బయగుండాలు’, ఇంకా అడుసుల ధాన్యం, ఏకబీజ, 160 రోజులలో పంటకి వచ్చే ‘ఇసుకరవ్వలు’, సొలాచ్చి, సోనాచేర్రి వంటి అనేక రకాలు పండించిన రైతులు కాలక్రమేణా కేవలం సన్నబియ్యానికే పరిమితమైపోయారు. ఇప్పుడు వరి విస్తీర్ణంలో సగానికి పైగా బిపిటి-5204 అనే రకమే పండుతోంది. దీనినే సోనామసూరి అని కర్నూలు రైస్ అని మార్కెట్లో అమ్ముతున్నారు.
అధిక దిగుబడి రకాల పరిశోధనలో కేవలం దిగుబడి, రసాయనిక ఎరువులకు ఎక్కువగా ప్రతిస్పందించే రకాలను ఎంపిక చేసుకోవడం వలన, వాటినే ప్రోత్సహించడం వలన నాణ్యమైన అనేక స్థానిక రకాలు సాగులోనుంచి వెళ్లిపోయాయి. రసాయనిక ఎరువు వేసినప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పడిపోవడంతో పొట్టి రకాలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే ఇవి, ఫిలిప్పిన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ మన దేశంలో పొట్టి రకాల పేరుతో ప్రవేశపెట్టిన ుచీ-1 (్aవaషష్ట్రబఅస్త్ర అa్‌ఱఙవ), I=-8 రకాలు, వాటిని వాడుకుని అభివృద్ధి చేసిన మరికొన్ని రకాలు తెగుళ్ళకి తట్టుకోలేనివి కావడంతో పురుగుల, తెగుళ్ల సమస్యలు ఎక్కువయ్యాయి. వరి భారతదేశంలోనే పుట్టిన పంట. దానివల్లనే అందులో జన్యువైవిధ్యం ఎక్కువ. దానిని కాపాడుకోవలసింది పోయి, ఈ వైవిధ్యాన్ని దెబ్బతీసే జన్యు మార్పిడి రకాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం ‘కార్జిజనా ప్రోటోకాల్’ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది.
వరిలో జన్యు మార్పిడి
వరిలో కాండం తొలుచు పురుగు తట్టుకోవటం కోసం ‘బి.టి.’ జన్యువులు ప్రవేశపెట్టటం కోసం పరిశోధనలతో పాటు, కలుపు మందు తట్టుకునే రకాలు అభివృద్ధి చేయటానికి ప్రైవేటు కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా స్థానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జన్యు మార్పిడి పంట తో వచ్చిన సమస్యలు గుర్తించకుండా వీటిమీద ఇంకా పనిచేయటం అన్యాయం. పైగా ప్రపంచంలోనే అధిక జన్యు వైవిధ్యం వుండి, వరికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో ఇలాంటి ప్రయత్నాలు చేయటం మరీ అన్యాయం.
వన్నెల వరి
‘దొడ్డుబియ్యం మంచిదా? సన్నబియ్యం మంచిదా?’, ‘తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా?’, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడి నిచ్చే వంగడాలు మంచివా? రైతుల్ని, వినియోగదారులను రోజు వేధించే ప్రశ్నలు. బియ్యంలో ఏమి పోషకాలు లేవు, లావు పెరగటానికి వరిబియ్యం ముఖ్య కారణం అని కొందరు, ఉత్పత్తిలో అధిక నీరు తీసుకోవటంతో పర్యావరణ సమస్యలు ఎక్కువ అని కొందరు, అస్సలు వరి మానేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అని కొందరు అంటున్న సమయంలో మన దేశం లో వరి పంట గురించి, పంట రకాల గురించి, బియ్యం చేసే విధానాల గురించి, ఎవరు ఎన్ని మాట్లాడినా రైతులు వరి పండిచటం కానీ, వినియోగ దారులు వరి బియ్యం తినటం కానీ ఎందుకు మానలేక పోతున్నారో తెలుసుకోవటం ముఖ్యం.
‘దొడ్డు బియ్యం’ అంత మంచివైతే ఇన్నాళ్ళూ వాటిని ఎందుకు మరిచి పోయారని, మా చిన్నప్పుడు అనేక రకాల బియ్యం తినేవాళ్లం అని, ఎర్రబియ్యం ఎంతో ఆరోగ్యకరమని, సువాసనలు వెదజల్లే ‘చిట్టి ముత్యాల’ అన్నం కలుపుకుని తింటే నేతితో కలుపుకున్నంత రుచిగా ఉండేదని పెద్దవాళ్ళు గుర్తు చేసుకోవడం విని మరి అవన్నీ ఏమైపోయాయని చాలా మందికి అనుమానం వచ్చింది.
దీనికి తోడు బియ్యంలో కేవలం ‘పిండి పదార్థాలు’ (కార్బోహైడ్రేట్స్) మాత్రమే ఉంటాయని, డయాబెటిస్ వున్నవారు ‘బియ్యం పదార్థాలు’ తగ్గించుకోవాలనడంతో అసలు బియ్యంలో ఉన్న పోషకాలు ఏమిటి, దానిలో పిండి పదార్ధాలు తప్ప మరేం లేవా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో వరి ఎదుర్కొంటున్న సమస్యలు, వరి విషయంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించే ఈ నెల కవర్ స్టోరీ.
వరి అన్ని ఆసియా దేశాల ప్రజల ముఖ్య ఆహారం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వరిలో 92 శాతం ఈ ప్రాంతంలోనే అవుతుంది. అందులో 90 శాతం ఇక్కడే వినియోగమవుతుంది కూడా. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆహారం కోసం, జీవనోపాధి కోసం వరి మీద ఆధారపడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మన దేశంలో అయితే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వరే ముఖ్య పంట. ముఖ్యమైన ఆహారం కూడా. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరి కారణంగా ‘అన్నపూర్ణ’గా పేరు తెచ్చుకుంది.
లక్షకు పైగా రకాలు
జన్యు వైవిధ్యం ఎక్కువగా ఉన్న పంటలలో వరి ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా వరి రకాలు ఉన్నాయని గుర్తించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 50 వేల రకాలకు పైగా సాగులో ఉన్నాయని నివేదికలు చెపుతున్నాయి. అయితే మన రైతులకి వంగడాల గురించి రాసిపెట్టుకోవడం అలవాటు లేకపోవడం వలన ఇంకా కొన్ని వేల రకాలు ఆ నివేదికలలోకి రాకపోయి వుండవచ్చని అంచనా. ఆసియా ఖండంలో పండే వరిలో మూడు ప్రాంతీయ రకాలు ఉన్నాయి. ఇవి ఇండికా, జపానికా, జవానికాలు. ప్రకృతిలో పరిణామాల ప్రభావంతోనూ, తమ ప్రాంతానికి, వనరులకి, ఆహారపు అలవాట్లకు, రుచులకు అనుగుణంగా రైతులు చేసుకున్న ఎంపిక వల్లనూ ఈ వైవిధ్యం ఏర్పడింది. ముఖ్యంగా వరి తినే విధానాన్ని బట్టి ఈ ఎంపిక సాగింది. ఈ వరి రకాల్లో వ్యత్యాసం ముఖ్యంగా గింజలలోని పిండి పదార్థం యొక్క భౌతిక, రసాయనిక లక్షణాల వలన ఏర్పడింది. పిండి పదార్థాలలో ఉండే ఈ వ్యత్యాసాల వలనే వండిన తర్వాత అన్నం పొడిగా ఉండడం లేదా జిగటగా ఉండడం జరుగుతుంది. జపానికా రకాలలో అమైలోజ్ తక్కువగా (దాదాపు 15 శాతం) ఉంటుంది. దీని వలన వండినపుడు అవి మెత్తగా అయిపోయి జిగటగా ఉంటాయి. తూర్పు ఆసియాలో ఇవి ఎక్కువగా పండిస్తారు. వాడతారు. మనదేశంలో పండే ఇండికా రకాలలో అమైలోజ్ (దాదాపు 20 శాతం) ఎక్కువ ఉంటుంది. దాని వల్లే అన్నం పొడిగా వస్తుంది.
వన్నెల వరి
వరి గింజలోని పై పొరలో ఉండే ‘ఆంత్రోసైనిన్’ అనే పిగ్మెంట్ వలన అనేక రంగుల వరి రకాలను మనం చూడవచ్చు. ఎరువు, ఊదా రంగుల నుండి గోధుమ, నలుపు వరకు రకరకాల రంగుల్లో వడ్లు పండుతాయి. మిల్లింగ్ జరిగేటప్పుడు ఈ బియ్యం పై పొర తీసివేస్తే లోపల గింజ చాలా వరి రకాలలోనూ తెల్లగానే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలోనూ ఎన్నో రకాలు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలో చిన్నంగి, నల్గొండ జిల్లాలో ఎర్రబియ్యం ‘గొట్టెలు’ చాలా మంది ఇష్టంగా తింటారు. విశాఖ మన్నెంలో నల్ల వడ్లు, ఇసుక రవ్వలు నేటికీ పండిస్తున్నారు. అయితే వినియోగదారులు ఎక్కువగా పాలిష్ చేసి తెల్లగా ఉండే బియ్యాన్నే ఇష్టపడడం వలన గింజ పై పొర తీసివేసి అమ్మడం జరుగుతోంది. దీనివలన రంగుతో పాటు ఎంతో విలువైన పోషకాలు కోల్పోతున్నాం మనం. ఎరుపు వరి రకాలలో ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 2, 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి.
ప్రతి ధాన్యపు గింజ లో రెండు బియ్యపు గింజలు వుండే ‘జుగల్’ రకం, మూడు బియ్యపు గింజలు వుండే ‘సౌతేన్’ రకం మన దేశం లో ఒకప్పుడు ఉండేవి. అలాగే చల్ల నీళ్ళల్లో వేయగానే తినటానికి వీలుగా అయ్యే రకం వరి అస్సాం లో వుంది.
అయితే ఈ రంగులు కేవలం గింజలల్లో మాత్రమే కాకుండా, ఆకుల్లో కూడా అనేక రంగుల వరి రకాలు వున్నాయి. జపాన్ దేశంలో అయితే పొలంలో అనేక రకాల వరి రకాలు పొలంలో వేసుకునేటప్పుడు రకరకాల డిజైన్ లు వచ్చేలా, వాటిల్లో పోటీలు నిర్వహించుకోవటం చేస్తారు. చైనా దేశంలో యున్నాన్ రాష్త్రం లో కొండ వాలు పైన మడులు చేసి పండించే అలవాటు వుంది. అక్కడి రైతులందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం అనేక రకాల వరి పండించటం వలన చూడటానికి దేశ విదేశాల నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. అలాగే గింజ ఆకారం లో కూడా బాగా పొడవు గింజ వుండే బాసుమతి రకాలతో పాటు, చిన్న సన్న రకాలు, గుండ్రటి రకాలు అనేకం వున్నాయి.
సువాసనల వరి:
రంగులు, అకారాలే కాక వరి పంటలో అనేక రకాల సువాసన రకాలు కూడా వున్నాయి. అన్నీ ప్రత్యేక సువాసనలు కలిగిన రకాలే. సుమతి, బాసుమతి లాంటి రకాలే కాక జీరా వరి, చిట్టి ముత్యాలు వంటి రకాలు అనేకం వున్నాయి.
ఆరోగ్యదాయక వరి
అలాగే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే వరి రకాలు వున్నాయి. కేరళ రాష్ట్రము లో ‘నవారా’, తమిళ్ నాడు లో ‘మాప్పిళ్లై’ రకాలు మగ వాళ్ళల్లో ‘ఫెర్టిలిటీ పెంచుతాయని చెపుతారు.. అలాగే గర్భవతులకి ఎక్కువ ఐరన్ అందించే రకాలు వున్నాయి.
అన్ని నేలల్లోనూ పండుతుంది
వరి పంట అనేక ప్రత్యేకతలు కలిగినది. మైదాన ప్రాంతాలలోనూ, కొండలమీదా, పూర్తిగా నీటిలోనూ, పూర్తిగా వర్షాధారంగానూ కూడా పండే పంట ఇది. వరి నీటి మొక్క కాదు. అయితే నీటిని తట్టుకునే మొక్క. కలుపు నివారణ కోసం నీరు పెట్టడం జరుగుతోంది. ప్రతి పరిస్థితికీ అనువైన రకాలు తరతరాలుగా రైతులు ఎంచుకుని సాగు చేసుకుంటున్నారు. నీటి ముంపుకు గురి అయ్యే ప్రాంతాలలో నీటి మట్టంతో పాటు పెరిగే రకాలు నేటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సాగులో ఉన్నాయి. ఈ రకం వరి ఒకే రోజు 1-2 అడుగులు కూడా పెరుగుతుందనేది ఎంత మందికి తెలుసు? అలాగే సముద్రతీర ప్రాంతాలలో ఉప్పునీటి కయ్యలలో పెరగగలిగే వరి రకాలూ ఉన్నాయి. సునామీ తర్వాత తమిళనాడులో అనేక తీర ప్రాంతాల పంట చేలు ఉప్పుబారిపోయినప్పుడు ఉప్పునీటిని తట్టుకునే ఈ రకాలను ఒరిస్సా రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి సేకరించి అక్కడి రైతులకు ఇచ్చి వారి పంట కోల్పోకుండా కాపాడగలిగారు.
నిజానికి నీరు నిలబడి జాలు వుండే పంట భూములను Paddy ‘ అంటారు. అలాంటి భూములలో కూడా పండ కలిగే పంట వరి. వరి లో ఎరువులు పురుగుమందులు వాడక పోతే ఇదే నీటిలో చేపలు బాతులు పెంచుకోవచ్చు.
వరి సాగు పర్యావరణం పై ప్రభావం
నీరు కట్టి పండించే పద్దతులనే అన్ని చోట్లా ప్రోత్సహించడం వలన 1950లలో 50 శాతం పైగా వున్న మెట్ట వరి నేడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. మెట్ట ప్రాంతాలలో కూడా నీరు కట్టి పండించే పద్ధతి రావడం వల్లనే భూగర్భ జలాలు నేడు అడుగంటి పోతున్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో భూగర్భ జలాలు 800 అడుగుల కంటే కిందకి వెళ్లి పోయాయి. ఒక ఎకరంలో నీరు కట్టి పండించే వరికి సుమారుగా 60,00,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అది సుమారుగా 100 కుటుంబాలు సంవత్సర పాటు ఇంటి అవసరాల కోసం వాడే నీటితో సమానం. దీనికి తోడు నీరు నిలబెట్టి పండించే వరి వలన వాతావరణం లోకి మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది భూతాపం పెంచటంలో కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ ప్రమాదకరం.
తక్కువ నీటి వినియోగంతో పండించే ‘శ్రీ’ వరిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు మొదట్లో కనిపించినా, అధికారులు, శాస్త్రవేత్తల మధ్య ఉన్న బేధాభిప్రాయాల వలన మన రాష్ట్రంలో ఆ కార్యక్రమం నత్తనడక నడుస్తోంది. నీరు కట్టి పండించే పద్దతిలో ఒక కిలో బియ్యం పండడానికి ఐదు వేల లీటర్ల నీరు వినియోగం అవుతుంది. అంటే ఒక మనిషి సుమారు రోజుకు 200 గ్రాముల బియ్యం తింటారు అనుకుంటే వరి బియ్యం తినడం ద్వారా వెయ్యి లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడన్నమాట. ఈ లెక్కన హైదరాబాదు జనాభా ఒక పూట తినే బియ్యం పండించడానికి సుమారు ఒక పెద్ద డ్యామ్ రిజర్వాయర్ నీరు అవసరం అవుతుంది. మనం పశువుల మేతగా వరిగడ్డి మీద ఎంత ఆధారపడతామో అందరికీ తెలిసిందే. అయితే పాత వరి రకాల గడ్డిని తినినంతగా ఇప్పుడొస్తున్న ఈ అధిక దిగుబడి రకాల గడ్డిని పశువులు ఇష్టపడవు. దీనికితోడు ఈ మధ్యకాలంలో వరి కోత యంత్రాలు రావడంతో ఆ విధంగా వచ్చే గడ్డి పశువుల మేతకు అసలు పనికిరాకుండా పోతోంది. దీనివలన పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడి పశువుల్ని అమ్మివేసుకనే పరిస్థితి వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో, దేశంలో మిగితా ప్రాంతాలలో వరి యంత్రాలతో కోసిన వెంటనే భూమిలో మిగిలిన మొదల్లను తగలబెట్టటం అలవాటుగా మారింది. దీనితో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ప్రతి సంవత్సరం పంజాబ్-హర్యానా రాష్ట్రాలలో కోటి ఎకరాలకు పైగా సాగు అయ్యే వరి పంటలో 90 శాతం పొలాల్లో అక్టోబర్ – నవంబర్ నెలల్లో
మొదళ్ళు తగుల బెడుతున్నారు. దీనితో ఈ పొగ గాలి చేరి, గ్రామాలను, పట్టణాలను కమ్మేస్తోంది. పైగా అదే సమయం లో పొగ మంచు కూడా ప్రారంభం కావటం తో సమస్య ఉత్తర భారతం అంతటా పాకింది. గత కొద్ది సంవత్సరాలుగా ఢిల్లీ నగరం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఊపిరి బిగబెట్టుకొని వుండాల్సి వస్తోంది.
సగం భూమిలో సోనా మసూరే
హరిత విప్లవం తరువాత ప్రభుత్వం అధిక దిగుబడినిచ్చే కొన్ని రకాలను మాత్రమే ప్రోత్సహించడం వలన త్వరత్వరగా వరిలో వైవిధ్యం కనుమరుగైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశంలో సుమారు 50 వేల రకాలు సాగులో ఉండేవని మొదట అనుకొన్నాం కదా. అలాంటిది, నేడు దేశంలో దాదాపు 85 శాతం వరి సాగు కేవలం పది అధిక దిగుబడి రకాల మీదనే ఆధారపడి వుంది. మన రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఒకప్పుడు మసూరి, నెల్లూరు మొలకొలుకులు, గోదావరి సన్నాలు వంటి సన్న వరి రకాలు, తెలంగాణలో చిట్టి ముత్యాలు లాంటి సువాసన రకాలు, కోస్తా ప్రాంతంలో 120 రోజులలో పండే పునాస రకం, నీరు కట్టకుండా పండే ‘బయగుండాలు’, ఇంకా అడుసుల ధాన్యం, ఏకబీజ, 160 రోజులలో పంటకి వచ్చే ‘ఇసుకరవ్వలు’, సొలాచ్చి, సోనాచేర్రి వంటి అనేక రకాలు పండించిన రైతులు కాలక్రమేణా కేవలం సన్నబియ్యానికే పరిమితమైపోయారు. ఇప్పుడు వరి విస్తీర్ణంలో సగానికి పైగా బిపిటి-5204 అనే రకమే పండుతోంది. దీనినే సోనామసూరి అని కర్నూలు రైస్ అని మార్కెట్లో అమ్ముతున్నారు.
అధిక దిగుబడి రకాల పరిశోధనలో కేవలం దిగుబడి, రసాయనిక ఎరువులకు ఎక్కువగా ప్రతిస్పందించే రకాలను ఎంపిక చేసుకోవడం వలన, వాటినే ప్రోత్సహించడం వలన నాణ్యమైన అనేక స్థానిక రకాలు సాగులోనుంచి వెళ్లిపోయాయి. రసాయనిక ఎరువు వేసినప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పడిపోవడంతో పొట్టి రకాలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే ఇవి, ఫిలిప్పిన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ మన దేశంలో పొట్టి రకాల పేరుతో ప్రవేశపెట్టిన TN-1 (tayachung native), IR-8 రకాలు, వాటిని వాడుకుని అభివృద్ధి చేసిన మరికొన్ని రకాలు తెగుళ్ళకి తట్టుకోలేనివి కావడంతో పురుగుల, తెగుళ్ల సమస్యలు ఎక్కువయ్యాయి. వరి భారతదేశంలోనే పుట్టిన పంట. దానివల్లనే అందులో జన్యువైవిధ్యం ఎక్కువ. దానిని కాపాడుకోవలసింది పోయి, ఈ వైవిధ్యాన్ని దెబ్బతీసే జన్యు మార్పిడి రకాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం ‘కార్జిజనా ప్రోటోకాల్’ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది.
వరిలో జన్యు మార్పిడి
వరిలో కాండం తొలుచు పురుగు తట్టుకోవటం కోసం ‘బి.టి.’ జన్యువులు ప్రవేశపెట్టటం కోసం పరిశోధనలతో పాటు, కలుపు మందు తట్టుకునే రకాలు అభివృద్ధి చేయటానికి ప్రైవేటు కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా స్థానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జన్యు మార్పిడి పంట తో వచ్చిన సమస్యలు గుర్తించకుండా వీటిమీద ఇంకా పనిచేయటం అన్యాయం. పైగా ప్రపంచంలోనే అధిక జన్యు వైవిధ్యం వుండి, వరికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో ఇలాంటి ప్రయత్నాలు చేయటం మరీ అన్యాయం.
వరిలో విటమిన్ ఏ ప్రవేశపెట్టి ‘గోల్డెన్ రైస్’ పేరుతో విడుదల చేయటానికి జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా స్థానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వరిలో ప్రవేశ పెట్టబడిన జన్యువుల వలన ఇప్పటి అంచనాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విటమిన్ ఎ తో మనిషి అవసరాలు తీరాలంటే సుమారు ఆరు కిలోల అన్నం రోజు తినాలని లెక్కలు చెపుతున్నాయి. ఇలాంటి అసంబద్ద పరిశోధనలతో, అనేక జీవ భద్రత అంశాలు ముడివడి వున్న జన్యుమార్పిడి విధానాలను ఇప్పటికైనా పక్కన పెడితే మంచిది.
వరిలో పోషకాలు
భారతదేశంలో 65 శాతం ప్రజలు, మన రాష్ట్రంలో అయితే దాదాపు అందరూ వరి ఆహారం మీదనే ఆధారపడతారు. వరి రకాలను బట్టి, వడ్ల నుంచి బియ్యం పట్టించే విధానాన్ని దీనిలో పోషక విలువలు ఉంటాయి. పైన ఉండే పొట్టు (bran)లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన అనేక ప్రొటీన్లు, కొవ్వుపదార్థాలు, పీచు, విటమిన్లు, మినరల్స్ (ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం) ఉన్నాయి.
అయితే బియ్యాన్ని పట్టినప్పుడు, పైన పొట్టుతో పాటు తెల్లగా రావడం కోసం బియ్యం పై పొరను ‘పాలిష్’ చేసి తీసేయటం వలన వరిలోని పోషకాలన్నీ పోయి కేవలం పిండి పదార్థాం (90 శాతం) మాత్రమే మిగులుతోంది. పోషకాలు అన్నీ తవుడు రూపంలో పోతే ఇంకేం మిగులుతుంది? అదే కొద్దిగా పాలిష్ (single polish) చేసిన లేక దంపుడు బియ్యంలో అయితే పిండి పదార్థాలు 75-85 శాతం ఉండి, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు 25-15 శాతం ఉంటాయి. ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం తినడం వలన విటమిన్-బి లోపంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
డయాబెటిస్‌కు ఇదే ప్రధాన కారణం
ఉదాహరణకు పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తినడం వలన అందులో ఉండే పిండి పదార్థం తొందరగా అరిగిపోయి రక్తంలో గ్లూకోస్ (blood sugar) పెరుగుతుంది. దీనివలన దీర్ఘకాలంలో సఱaపవ్వర వచ్చే ప్రమాదం ఉంది. దీనికి తోడు తొందరగా అరగడం వలన తొందరగా ఆకలి వేయడం, విడుదలైన శక్తి తొందరగా వినియోగం అయిపోయి, ఎప్పుడు చూసినా నీరసంగా అనిపిస్తుంటుంది. అందువలన పూర్తిగా పాలిష్ చేసిన బియ్యం కాకుండా దంపుడు బియ్యం లేదా సెమీ పాలిష్డ్ (సగం పాలిష్ చేసిన) బియ్యం తింటే మంచిది.
వరిలో అమైలోజ్, అమైలోపెక్టిన్ అని రెండు రకాల పిండి పదార్థాలు ఉంటాయి. అధిక దిగుబడి వంగడాలలో అమైలో పెక్టిన్ ఎక్కువ ఉండడం వలన (high glycemic index) అవి తొందరగా అరిగి రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి. స్థానిక వంగడాలలో, పాత రకం వంగడాలలో చాలా మటుకు అమైలోజే ఎక్కువ ఉండి (low glycemic index) ఆలస్యంగా అరుగుతాయి. గ్లూకోజ్ పెరగడం కూడా తక్కువ. అందువల్ల పాత వంగడాలను, దంపుడు బియ్యాన్ని లేదా సెమీ పాలిష్డ్ (సగం పాలిష్ చేసిన) బియ్యాన్ని తినడం మంచిది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువవుతాయి.
నిజానికి దొడ్డు రకాలతో పోలిస్తే బాసుమతి లాంటి సువాసన రకాలలో, సన్నబియ్యం రకాలలో గ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ. అయితే వాటిని దంపుడు లేదా సెమీ పాలిష్డ్గా తిన్నప్పుడే ప్రయోజనం. అప్పుడే అందుతాయి. సెమీ పాలిష్డ్. దంపుడు బియ్యాలలో ప్రోటీనులు కూడా (ముఖ్యంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ‘లైసిన్’ వంటివి) ఎక్కువగా ఉంటాయి. ప్రోటీనులు ఎక్కువ ఉండే స్థానిక / పాత వంగడాలు మనకు చాలా ఉన్నాయి. ఎరుపు, నలుపు, వరి రకాలలో విటమిన్-ఎకి అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది. వీటిని ప్రోత్సహించకుండా జన్యుమార్పిడి ద్వారా అభివృద్ధి చేసిన ‘స్వర్ణవరి’ (గోల్డెన్ రైస్)ని ప్రవేశపెట్టాలని ఇప్పుడు ప్రభుత్వం, కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
దంపుడు / సెమీ పాలిష్డ్ బియ్యంలో మంచికొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. పాలిషింగ్ వలన తవుడులో ఇవి పోయి మరలా బిస్కెట్లు, హార్లిక్స్గాను, మాత్రల రూపంలోను కొనుక్కుని తినవలసి వస్తుంది. వీటన్నింటికీ తోడు, ఎరుపు/ బ్రౌన్ / నలుపు రకాలను ముఖ్యంగా దంపుడు / సెమీ పాలిష్డ్ బియ్యంగా వాడుకున్నప్పుడు వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ – ఎ (టోకోఫెరాల్). టోక్రోటయోనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సర్ కారకాలైన ‘ఫ్రీ రాడికల్స్’ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి కణజాలాన్ని. డి.ఎన్.ఏని ఆక్సిడేటివ్ డామేజ్ నుంచి కూడా రక్షిస్తాయి.
అధిక దిగుబడి వంగడాల పేరుతోనూ, తెల్లటి మల్లెపువ్వు లాంటి అన్నం తినాలనే కోరికతోనూ తరతరాలుగా ఉన్న జన్యు వైవధ్యాన్ని కోల్పోయి చాలా నష్టపోతున్నాం. జన్యు వైవిధ్యం కోల్పోవడం అంటే మన ఆరోగ్యాన్ని మనం చేజేతులా కోల్పోవడమే. అలాగే నీటి వినియోగం ఎక్కువ ఉండే రకాలు, పద్ధతులు అవలంబించడం అంటే ఈ భూమి మీద మన భవిష్యత్తుని మనం చేతులారా అంతం చేసుకోవడమే.
డా|| రిచారియా అమూల్య ప్రయత్నాలు
భారతదేశంలో వరి వైవిధ్యం గురించి ఏ చర్చ అయినా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.హెచ్. రిచారియా గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాదు. 1960లలో కటక్‌లోని కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ (సి.ఆర్.ఆర్.ఐ) డైరెక్టర్‌గా పనిచేసిన డా|| రిచారియా దేశమంతా తిరిగి అనేక స్థానిక వరి రకాలను సేకరించారు. టి.ఎన్-1, ఐ.ఆర్-8 లలో కూడా పురుగులను తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేశారు. కానీ ఈయన సలహాలను పెడచెవిన పెట్టి అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఏ పరీక్షలూ చేయకుండానే టి.ఎన్-1, ఐ.ఆర్-8 రకాల విత్తనాలను దేశంలోకి దిగుమతి చేసి రైతులకు పంపిణీ చేసింది. దీనికి అభ్యంతరం చెప్పినందుకు అయనను సి.ఆర్.ఆర్.ఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తాను సేకరించిన రకాలను రాయపూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉంచారు. కానీ ప్రభుత్వం వాటిని 1990లలో సింజెంటా అనే విత్తనాల కంపెనీకి అమ్మేసింది. స్థానిక ప్రజల నుంచే కాక అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
సేవ్ రైస్ కాంపెయిన్
దేశంలోని వరిలో జన్యువైవిధ్యం కాపాడటానికి కేరళలోని ‘తనల్ (thanal) సంస్థ దేశంలోని అనేక స్వచంధ సంస్థలతో, రైతులతో కలిసి ”సేవ్ రైస్” పేరుతో వుద్యమం నడుపుతున్నారు. వీరి ప్రయత్నాలతో అనేక వందల పాత రకాలు మరలా సాగు లోకి వచ్చాయి. అలాగే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళలో ముఖ్యులు శ్రీ విజయరాం గారు. అనేక వరి రకాలను కాపాడటమే కాక మిగతా రైతులకు కూడా అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న వరి రకాల వివరాలకు
https://en.wikipedia.org/wiki/List_of_rice_varieties చూడండి
సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ సభ్యులైన అనేక మంది రైతులు ఇలాంటి అనేక పాతరకాలను
ఉత్పత్తి చేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన వరి రకాలు, ధాన్యం, బియ్యం సహజ ఆహారం షాప్ లలో దొరుకుతాయి. వరి రకాలు కావాలనుకుంటే సుస్థిర వ్యవసాయ కేంద్రంను కానీ, సహజ ఆహారంలో కానీ సంప్రదించండి 08500 78 3300, 0850098 3300
వరిలో కాండం తొలుచు పురుగు తట్టుకోవటం కోసం ‘బి.టి.’ జన్యువులు ప్రవేశపెట్టటం కోసం పరిశోధనలతో పాటు, కలుపు మందు తట్టుకునే రకాలు అభివృద్ధి చేయటానికి ప్రైవేటు కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా స్థానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జన్యు మార్పిడి పంట తో వచ్చిన సమస్యలు గుర్తించకుండా వీటిమీద ఇంకా పనిచేయటం అన్యాయం. పైగా ప్రపంచంలోనే అధిక జన్యు వైవిధ్యం వుండి, వరికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో ఇలాంటి ప్రయత్నాలు చేయటం మరీ అన్యాయం.
వరిలో విటమిన్ ఏ ప్రవేశపెట్టి ‘గోల్డెన్ రైస్’ పేరుతో విడుదల చేయటానికి జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా స్థానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వరిలో ప్రవేశ పెట్టబడిన జన్యువుల వలన ఇప్పటి అంచనాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విటమిన్ ఎ తో మనిషి అవసరాలు తీరాలంటే సుమారు ఆరు కిలోల అన్నం రోజు తినాలని లెక్కలు చెపుతున్నాయి. ఇలాంటి అసంబద్ద పరిశోధనలతో, అనేక జీవ భద్రత అంశాలు ముడివడి వున్న జన్యుమార్పిడి విధానాలను ఇప్పటికైనా పక్కన పెడితే మంచిది.
వరిలో పోషకాలు
భారతదేశంలో 65 శాతం ప్రజలు, మన రాష్ట్రంలో అయితే దాదాపు అందరూ వరి ఆహారం మీదనే ఆధారపడతారు. వరి రకాలను బట్టి, వడ్ల నుంచి బియ్యం పట్టించే విధానాన్ని దీనిలో పోషక విలువలు ఉంటాయి. పైన ఉండే పొట్టు (పతీaఅ)లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన అనేక ప్రొటీన్లు, కొవ్వుపదార్థాలు, పీచు, విటమిన్లు, మినరల్స్ (ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం) ఉన్నాయి.
అయితే బియ్యాన్ని పట్టినప్పుడు, పైన పొట్టుతో పాటు తెల్లగా రావడం కోసం బియ్యం పై పొరను ‘పాలిష్’ చేసి తీసేయటం వలన వరిలోని పోషకాలన్నీ పోయి కేవలం పిండి పదార్థాం (90 శాతం) మాత్రమే మిగులుతోంది. పోషకాలు అన్నీ తవుడు రూపంలో పోతే ఇంకేం మిగులుతుంది? అదే కొద్దిగా పాలిష్ (రఱఅస్త్రశ్రీవ జూశీశ్రీఱరష్ట్ర) చేసిన లేక దంపుడు బియ్యంలో అయితే పిండి పదార్థాలు 75-85 శాతం ఉండి, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు 25-15 శాతం ఉంటాయి. ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం తినడం వలన విటమిన్-బి లోపంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
డయాబెటిస్‌కు ఇదే ప్రధాన కారణం
ఉదాహరణకు పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తినడం వలన అందులో ఉండే పిండి పదార్థం తొందరగా అరిగిపోయి రక్తంలో గ్లూకోస్ (పశ్రీశీశీస రబస్త్రaతీ) పెరుగుతుంది. దీనివలన దీర్ఘకాలంలో సఱaపవ్వర వచ్చే ప్రమాదం ఉంది. దీనికి తోడు తొందరగా అరగడం వలన తొందరగా ఆకలి వేయడం, విడుదలైన శక్తి తొందరగా వినియోగం అయిపోయి, ఎప్పుడు చూసినా నీరసంగా అనిపిస్తుంటుంది. అందువలన పూర్తిగా పాలిష్ చేసిన బియ్యం కాకుండా దంపుడు బియ్యం లేదా సెమీ పాలిష్డ్ (సగం పాలిష్ చేసిన) బియ్యం తింటే మంచిది.
వరిలో అమైలోజ్, అమైలోపెక్టిన్ అని రెండు రకాల పిండి పదార్థాలు ఉంటాయి. అధిక దిగుబడి వంగడాలలో అమైలో పెక్టిన్ ఎక్కువ ఉండడం వలన (ష్ట్రఱస్త్రష్ట్ర స్త్రశ్రీవషవఎఱష ఱఅసవఞ) అవి తొందరగా అరిగి రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి. స్థానిక వంగడాలలో, పాత రకం వంగడాలలో చాలా మటుకు అమైలోజే ఎక్కువ ఉండి (శ్రీశీష స్త్రశ్రీవషవఎఱష ఱఅసవఞ) ఆలస్యంగా అరుగుతాయి. గ్లూకోజ్ పెరగడం కూడా తక్కువ. అందువల్ల పాత వంగడాలను, దంపుడు బియ్యాన్ని లేదా సెమీ పాలిష్డ్ (సగం పాలిష్ చేసిన) బియ్యాన్ని తినడం మంచిది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువవుతాయి.
నిజానికి దొడ్డు రకాలతో పోలిస్తే బాసుమతి లాంటి సువాసన రకాలలో, సన్నబియ్యం రకాలలో గ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ. అయితే వాటిని దంపుడు లేదా సెమీ పాలిష్డ్గా తిన్నప్పుడే ప్రయోజనం. అప్పుడే అందుతాయి. సెమీ పాలిష్డ్. దంపుడు బియ్యాలలో ప్రోటీనులు కూడా (ముఖ్యంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ‘లైసిన్’ వంటివి) ఎక్కువగా ఉంటాయి. ప్రోటీనులు ఎక్కువ ఉండే స్థానిక / పాత వంగడాలు మనకు చాలా ఉన్నాయి. ఎరుపు, నలుపు, వరి రకాలలో విటమిన్-ఎకి అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది. వీటిని ప్రోత్సహించకుండా జన్యుమార్పిడి ద్వారా అభివృద్ధి చేసిన ‘స్వర్ణవరి’ (గోల్డెన్ రైస్)ని ప్రవేశపెట్టాలని ఇప్పుడు ప్రభుత్వం, కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
దంపుడు / సెమీ పాలిష్డ్ బియ్యంలో మంచికొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. పాలిషింగ్ వలన తవుడులో ఇవి పోయి మరలా బిస్కెట్లు, హార్లిక్స్గాను, మాత్రల రూపంలోను కొనుక్కుని తినవలసి వస్తుంది. వీటన్నింటికీ తోడు, ఎరుపు/ బ్రౌన్ / నలుపు రకాలను ముఖ్యంగా దంపుడు / సెమీ పాలిష్డ్ బియ్యంగా వాడుకున్నప్పుడు వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ – ఎ (టోకోఫెరాల్). టోక్రోటయోనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సర్ కారకాలైన ‘ఫ్రీ రాడికల్స్’ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి కణజాలాన్ని. డి.ఎన్.ఏని ఆక్సిడేటివ్ డామేజ్ నుంచి కూడా రక్షిస్తాయి.
అధిక దిగుబడి వంగడాల పేరుతోనూ, తెల్లటి మల్లెపువ్వు లాంటి అన్నం తినాలనే కోరికతోనూ తరతరాలుగా ఉన్న జన్యు వైవధ్యాన్ని కోల్పోయి చాలా నష్టపోతున్నాం. జన్యు వైవిధ్యం కోల్పోవడం అంటే మన ఆరోగ్యాన్ని మనం చేజేతులా కోల్పోవడమే. అలాగే నీటి వినియోగం ఎక్కువ ఉండే రకాలు, పద్ధతులు అవలంబించడం అంటే ఈ భూమి మీద మన భవిష్యత్తుని మనం చేతులారా అంతం చేసుకోవడమే.
డా|| రిచారియా అమూల్య ప్రయత్నాలు
భారతదేశంలో వరి వైవిధ్యం గురించి ఏ చర్చ అయినా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.హెచ్. రిచారియా గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాదు. 1960లలో కటక్‌లోని కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ (సి.ఆర్.ఆర్.ఐ) డైరెక్టర్‌గా పనిచేసిన డా|| రిచారియా దేశమంతా తిరిగి అనేక స్థానిక వరి రకాలను సేకరించారు. టి.ఎన్-1, ఐ.ఆర్-8 లలో కూడా పురుగులను తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేశారు. కానీ ఈయన సలహాలను పెడచెవిన పెట్టి అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఏ పరీక్షలూ చేయకుండానే టి.ఎన్-1, ఐ.ఆర్-8 రకాల విత్తనాలను దేశంలోకి దిగుమతి చేసి రైతులకు పంపిణీ చేసింది. దీనికి అభ్యంతరం చెప్పినందుకు అయనను సి.ఆర్.ఆర్.ఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తాను సేకరించిన రకాలను రాయపూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉంచారు. కానీ ప్రభుత్వం వాటిని 1990లలో సింజెంటా అనే విత్తనాల కంపెనీకి అమ్మేసింది. స్థానిక ప్రజల నుంచే కాక అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
సేవ్ రైస్ కాంపెయిన్
దేశంలోని వరిలో జన్యువైవిధ్యం కాపాడటానికి కేరళలోని ‘తనల్ (్‌ష్ట్రaఅaశ్రీ) సంస్థ దేశంలోని అనేక స్వచంధ సంస్థలతో, రైతులతో కలిసి ”సేవ్ రైస్” పేరుతో వుద్యమం నడుపుతున్నారు. వీరి ప్రయత్నాలతో అనేక వందల పాత రకాలు మరలా సాగు లోకి వచ్చాయి. అలాగే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళలో ముఖ్యులు శ్రీ విజయరాం గారు. అనేక వరి రకాలను కాపాడటమే కాక మిగతా రైతులకు కూడా అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న వరి రకాల వివరాలకు
ష్ట్ర్‌్‌జూర://వఅ.షఱసఱజూవసఱa.శీతీస్త్ర/షఱసఱ/కూఱర్బిశీటబితీఱషవబిఙaతీఱవ్ఱవర చూడండి
సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ సభ్యులైన అనేక మంది రైతులు ఇలాంటి అనేక పాతరకాలను
ఉత్పత్తి చేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన వరి రకాలు, ధాన్యం, బియ్యం సహజ ఆహారం షాప్ లలో దొరుకుతాయి. వరి రకాలు కావాలనుకుంటే సుస్థిర వ్యవసాయ కేంద్రంను కానీ, సహజ ఆహారంలో కానీ సంప్రదించండి 08500 78 3300, 0850098 3300
Tag:Telugu, వన్నెల వరి