వంగలో కాండము, కాయతొలుచు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వంగలో కాండము, కాయతొలుచు పురుగు
పురుగు ఆశించు కాలం: అన్ని సమయాల్లో రావచ్చు
నివారణ :
- ఈ పురుగు ఒక్క వంగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది.
- వాల్చిన తలలను, తొలచిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి.
- ఎకరానికి 50 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతి పర్యవేక్షణ మాత్రమే కాకుండా మగ రెక్కల పురుగులను బందించి సమర్ధవంతంగా అదుపుచేయవచ్చు.
- 5% వేప కషాయం పిచికారి చేసి పొలంలో తల్లిపురుగు గుడ్లు పెట్టకుండా పారద్రోలవచ్చు.
Tag:నివారణ