లాంటాన
లాంటాన
ఈ మొక్క ఆకులను వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వుపయోగించవచ్చు.
ఈ మొక్క ఆకులలో, ఫలాలలో టెర్పనాయిడ్స్, సైటోస్టీరాల్, కెమారనింగ్ యాసిడ్, లాంటానోన్ వంటి అనేక రకాలైన రసాయనాలు ఉంటాయి.
లాంటానా మొక్క ఆకులలో ఉన్న అనేక రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి. లాంటానా ఆకుల కషాయం పంటలలో వచ్చే రసంపీల్చే పురుగులను, ఆకుముడత మరియు ఆకులను తినే చిన్న చిన్న గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించగలదని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
లాంటాన కషాయాన్ని పంటలలో వచ్చే బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, త్రుప్పు తెగులు, బోట్రైటిస్ తెగులు, తదితర తెగుళ్ళ నివారణలో వుపయోగించవచ్చు.
లాంటానా కషాయాన్ని వంగ, టమాట, మిరప, మినుము, పెసరలో వచ్చే ఆకుమచ్చ తెగులు మరియు వేరుశనగలో వచ్చే తిక్కా ఆకుమచ్చ తెగులు నివారణకు రైతులు వుపయోగించి మంచి ప్రయోజనం పొందవచ్చు.
లాంటానా మొక్కను పంటలలో వచ్చే బ్యాక్టీరియా తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగించవచ్చని డా|| దీపక్ గంజివాల (తమిళనాడు) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
Tag:లాంటాన