మురిపిండ
మురిపిండ
మురిపిండ మొక్కలో ఉన్న ‘కన్నాబినాల్’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. మురిపిండ ఆకులను పంచపత్ర కషాయం తయారీలో వుపయోగించవచ్చు. ఈ కషాయాన్ని రైతులు తమంతటతామే పొలం వద్ద తయారు చేసుకోవచ్చు. మురిపిండ ఆకుల కషాయానికి స్పర్శ చర్య మరియు ఉదర చర్య ఉంటాయి. అందువలన ఈ కషాయం ఒకశక్తివంతమైన కీటక నాశనిగా పనిచేసి పురుగును అదుపులో వుంచుతుంది.
మురిపిండ ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చుపురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ మొక్క ఆకు ద్రావణానికి శిలీంద్ర నాశని లక్షణాలు ఉన్నట్లు డా|| జబకుమార్ సోలమన్ (తమిళనాడు) పరిశోధనలతో నిరూపితమైంది.
దోమల లార్వాలను నిర్మూలించే గుణం మురిపిండ ద్రావణానికి వుందని డా|| కెల్మ్ (1997) పరిశోధనలు తెలుపుతున్నాయి. పత్తి పంటలో మురిపిండ కషాయాన్ని ఆకులు తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు వుపయోగించవచ్చని డా|| సహయరాజ్ మరియు డా|| శోభ (తమిళనాడు) పరిశోధనలు తెలుపుతున్నాయి.
మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి. అందువల్ల మురిపిండ ఆకుల కషాయం పంటలపై పిచికారీ చేస్తే, కషాయంలో ఉండే రసాయనాలు కీటకాలకు, ఆహార భక్షక నిరోధకంగా పనిచేస్తాయి. (డా|| రఘునాథ్)
Tag:మురిపిండ