మామిడిలో హైబ్రిడ్ రకాలు
హైబ్రిడ్ రకాలు
ఎయు రుమాని (రుమాని x మల్గోవా)
పండు మధ్యమం నుండి పెద్దదిగా ఉంటుంది. కండ మృదువైనది. రసం నిండుగా ఉండి నార ఉండదు. కాయలు తక్కువగా కాస్తుంది. నాణ్యమైన పండ్లను ఆలస్యంగా ఇస్తుంది. రవాణాకు అనువైనది.
ఆమ్రాపాలి (దశేరి x నీలం)
మధ్యస్థ రకం. కాయలు హెచ్చుగా, ప్రతి సంవత్సరం కాస్తాయి. కాయలు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. పెద్ద గుత్తుగా కాస్తాయి.
మల్లిక (నీలం x దశేరి)
చెట్టు మధ్యస్థం, తెలంగాణా జిల్లాలలో కాపు ఎక్కువ. ప్రతి యేటా కాస్తుంది. పండు పరిమాణం పెద్దది. నాణ్యత ఎక్కువ. కాయ పొడవుగా ఉంటుంది. సాధారణంగా కాపు కొమ్మకు రెండు కాయల చొప్పున ఏర్పడతాయి.
కేసర్:
చెట్టు పెద్దదిగా ఉంటుంది. పండు పసుపు – ఎరుపురంగులో ఉండి, నార ఉండదు. మంచి నాణ్యత కలిగి నిలకడగా కాపు కాస్తుంది. ఎగుమతికి అనువైనది. కోస్తా జిల్లాలు మరియు తెలంగాణా ప్రాంతాలకు అనుకూలం.
అలంపూర్ బేనిషాన్ :
కోత రకం. ప్రతి సంవత్సరం కాస్తుంది. మే – జూన్లో పక్వానికి వస్తుంది. కాయ పెద్దదిగా ఉంటుంది. నాణ్యత చాలా ఎక్కువ. తెగుళ్ళను తట్టుకొంటుంది. కాయలు కొంచెం తక్కువగా కాస్తాయి.
జలాల్ :
పచ్చడి రకం. ప్రతి సంవత్సరం కాపు నిస్తుంది. కాయ పరిమాణం పెద్దది. పచ్చడి రకాలలో ఇది మంచి రకం. కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంది. పండుగా కూడా వాడవచ్చు.
చెరకు రసం:
చెరకు రసం పండు కోలగా ఉండి, సుమారు 300 నుండి 400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. నిలకడగా కాపు కాస్తుంది. ఈ రకం రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు అనుకూలం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ రకాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. జూన్ నెలలో పండ్లు కోతకు వస్తాయి.