మందార
మందార
మందార ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఇండ్లలో, ఉద్యాన వనాలలో పెంచబడుతుంది.
ఈ మొక్క పత్రాలలో మరియు పువ్వులలో ఆంథోసయనిన్స్ మరియు ఫ్లావనాయిడ్స్ సయానిడిన్, గ్లూకోసైడ్స్, రిబోఫ్లానిన్, ఏస్కార్బిక్ యాసిడ్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.
మందార మొక్క ఆకులు, మరియు పువ్వులలో వున్న రసాయనాలు కీటక నియంత్రణలో ముఖ్యంగా మామిడి, జామ, అత్తి మొ|| పండ్లనాశించే పండుఈగ నియంత్రణలో వుపయోగపడతాయి.
అదే విధంగా మందార ఆకుల కషాయాన్ని ఎర్రనల్లి నివారణలో వుపయోగించవచ్చని డా|| మన్సింగ్ (ఉత్తర ప్రదేశ్) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. మందార ఆకుల కషాయంకు తెగుళ్ళను నివారించే గుణం వున్నట్లు డా|| చాంగ్ (చైనా) ప్రయోగాల ద్వారా తెలుస్తున్నది.
మందార ఆకులను వివిధ ఆకుల కషాయం (పంచపత్ర కషాయం) తయారీలో వుపయోగించవచ్చని రైతులకు సూచిస్తున్నాం. సస్యరక్షణలో ఈ మొక్క వుపయోగాల గురించి ఇంకా పరిశోధనలు చాలా అవసరం. మందార మొక్కలను ముదురు మొచ్చెలు (ూ్వఎ జబ్్ఱఅస్త్ర) వుపయోగించి గానీ, గ్రాప్టింగ్స్ (అంట్లుకట్టుట) ద్వారా గానీ ప్రవర్ధనం చేయవచ్చు.
Tag:మందార