మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి – డా॥ జి.రాజశేఖర్
మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి – డా॥ జి.రాజశేఖర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం
అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి. నాణ్యమైన విత్తనం పైరు ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. గత నలభై సంవత్సరాలుగా అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రూపొందించి మరియు వాటిని రైతులకు అందుబాటు ధరలలో అందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాయాలు, వ్యవసాయశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుత విత్తన మార్పిడి రేటు 40 శాతం మాత్రమే. మిగతా 60 శాతం విత్తనాలను రైతు తమ స్వంత పొలాల నుండి పండిరచిన విత్తనాలే వాడుతున్నారు.
విత్తనోత్పత్తి – ప్రమాణాలు
పంట అధిక దిగుబడికి మంచి రకం వాడటం మొదటి చర్య. మంచి విత్తనం వాడటం రెండో చర్య. విత్తనం మంచిది కాకపోతే ఆధునిక యాజమాన్య పద్ధతులను పాటించినా, హెచ్చు దిగుబడిని సాధించలేం. మంచి విత్తనాలు కొన్ని ప్రమాణాలు కలిగి వుంటాయి.
1. జన్యు శుద్ధత (జెనెటిక్ ప్యూరిటీ)
ఒక్కొక్క రకం విత్తనాలకు, ఆ విత్తనాల నుంచి పుట్టిన మొక్కలకు ప్రత్యేకమైన స్వరూపాత్మక లక్షణాలు, స్వాభావిక క్షణాలు వుంటాయి. ఉదాహరణకు స్వర్ణ రకం విత్తనాలు ఎరుపు రంగులో వుంటాయి. మొక్క మొలిచింది మొదలు కోత వరకు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో వుండి మన కండ్లను ఆకర్షిస్తాయి. అవి స్వరూపాత్మక క్షణాలు. స్వర్ణ వరి మొక్కలు నేలలో లభించే నత్రజనిని ఎక్కువగా తీసుకుంటాయి. నీటి ఎద్దడిని, నీటి ముంపును తట్టుకుంటాయి. ఇవి స్వాభావిక క్షణాలు. ప్రతి రకపు విత్తనం ఆ రకపు స్వరూపాత్మక, స్వాభావిక క్షణాలను తప్పనిసరిగా కలిగి వుండాలి. ఒక రకం విత్తనం నాటి, ఆ పంట కోసినప్పుడు అదే రకం పంట రావాలి. ఒక స్వచ్ఛమైన రకం నుంచి అదే రకం విత్తనాన్ని పొందటమే స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. దీనినే జన్యు శుద్ధత లేక జన్యు స్వచ్ఛత అంటారు.
2. భౌతిక శుద్ధత
విత్తనం రంగు తగ్గకూడదు. పొల్లు (తాలు), సగం నిండిన విత్తనాలు వుండకూడదు. విత్తనాలలో మట్టి బెడ్డలు, ఇసుక, దుమ్ము, దూగర మొదలైన జడ పదార్థాలు, కలుపు విత్తనాలు, వేరే పంట విత్తనాలు వుండకూడదు. జడ పదార్థాలు, కలుపు విత్తనాలు, ఇతర పంట విత్తనాలు ఎంత శాతంలో వున్నాయో తెలియజేసినప్పుడు భౌతిక శుద్ధత స్థాయి తెలుస్తుంది. అవేవీ లేకపోతే విత్తనం పూర్తి భౌతిక శుద్ధత కలిగి వుందని అంటారు.
3. తేమ శాతం
విత్తనంలో తేమ శాతం 14 కంటే ఎక్కువగా వుంటే నిల్వ చేయటానికి పనికి రాదు. తేమశాతం 11 కంటే తక్కువగా వుంటే మొలకెత్తదు. 13 శాతం తేమ కలిగిన విత్తనం మంచిది.
4. మొలక శాతం
విత్తనం కనీసం 80 మొలక శాతం కలిగి వుండాలి. నూటికి కనీసం 80 గింజలు మొలకెత్తాలి. 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొలక శాతం కలిగివున్న విత్తనం మంచిది. మొలక శాతం పరీక్షించినప్పుడు 80 శాతం వుండవచ్చు. కానీ 8 నెలల తరువాత నుంచి మొలక శాతం తగ్గుతూ వుంటుంది. అందుచేత మొలక శాతం, పరీక్షించిన తేదీ, లేదా నెల విత్తనం సంచి మీద రాసి వుంటుంది. దానిని చూసి విత్తనం కొనాలి. ప్యాకింగ్ చేశాక 8 నెలలు మించితే ఆ విత్తనం కొనకూడదు.
జన్యు