పొదుగులో గజ్జి – సాగరి రాందాస్ (కొట్టం దగ్గరికి వైద్యం)
సోకే పశువులు: గేదె, ఆవు.
సోకే కాలం: అన్ని కాలాల్లోనూ…
లక్షణాలు:
– కొద్దిగా జ్వరం
– పొదుగు మీద పొంగు బొబ్బలు.
– పొదుగు మీది బొబ్బలు తొందరలోనే పొక్కులు కడతాయి.
– పశువు నుంచి పశువుకి వేగంగా వ్యాపిస్తుంది.
– పుళ్ళు మనుషులకు కూడా అంటుకుంటాయి.
– పాలు పిండే వారి చేతుల్లో మోహంలో కూడా పుళ్ళు, దురద కనిపించవచ్చు.
కారణం : వైరస్
వ్యాపించే పద్ధతి:
వైరస్ సోకిన పదార్థాలను అంటుకోవటం, తినడం, జబ్బు సోకిన పశువులతో దగ్గరగా వున్నప్పుడు మనుషులకు కూడా వస్తుంది.
ముందు జాగ్రత్తలు:
పరిశుభ్రత అవసరం. జబ్బు సోకిన పశువును తక్కిన వాటి నుంచి దూరంగా వుంచాలి. జబ్బు పడ్డ పశువుతో పని చేసే మనుషులు, ముఖ్యంగా పాలు పిండేవారు, పాలు పితకడానికి ముందు, పిండిన తరువాత మరో పశువును అంటుకోనే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రథమ చికిత్స:
పశువును జాగ్రత్తగా చూసుకోవాలి. గంజి, అంబలి వంటి పోషక విలువలున్న తేలిక ఆహారాన్ని ఇవ్వాలి. హైమాక్స్ ఆయింట్మెంట్, వేపనూనె పొంగు బొబ్బలకు రాయండి.
¬మియోపతి:
ూదయం: రుస్టాక్స్ 200 ఒక డోస్. అరగంట తరువాత యాంటిమోనియం టార్ట్ 200 ఒక డోసు.
మధ్యాహ్నం: పల్సటిల్లా 200 ఒక డోసు
సాయంత్రం : నాట్మూర్ 200 ఒక డోసు
రాత్రి: ఆర్సెనిక్ అల్బమ్ 200 ఒక డోసు
గమనిక: రుస్టాక్స్, పల్సటిల్లాలను జబ్బులేని పశువులకు కూడా ఇవ్వాలి. జబ్బురాకుండా అది సహాయపడుతుంది.
Tag:గజ్జి