పురుగులను తినే పక్షులు
పురుగులను తినే పక్షులు
గోరింక, పోలీస్ పిట్ట, పాలపిట్ట పంట పొలాల్లో కొమ్మలపై వాలి లేదా పొలంలో ఎగురుతూ శత్రుపురుగులను ఏరి తింటాయి. పంటలలో పక్షులు వాలడానికి వీలుగా పంగలకర్రలు ఏర్పాటు చేసి ఇటువంటి పురుగులను తినే పక్షులను ఆకర్షించవచ్చు. కొంగలు పొలం దున్నేటప్పుడు నాగలి వెంట నడుస్తూ నిద్రావస్థలో వున్న పురుగులని ఏరి తింటాయి. గుడ్లగూబలు రాత్రిళ్ళు ఎలుకలను వేటాడి తింటాయి.