పశువులలో వివిధ రకాల వాపులు – సాగరి రాందాస్ (కొట్టం దగ్గరికి వైద్యం)
వాపులు రకాలు: వాటిలో పశువులకు వచ్చేవి ప్రధానంగా ఈ నాలుగు.
1. కణితి / కాయలు / గెడ్డ
2. నీరుగంతి / నీరు కణితి / నీటి గడ్డ
3. నీరు దిగుట
4. గెంతి
5. ూలిసిరికాయ
1. కణితి / కాయలు / గెడ్డ లక్షణాలు:
- వేడిగా, గట్టిగా ూండే, నొప్పి కలిగించే గెడ్డలు, శరీరమంతా ఎక్కడైనా రావచ్చు.
- కారణాలు: శరీరంలోపల, బయట సూక్ష్మ క్రిములతో వచ్చే ఇన్ఫెక్షన్, శుభ్రంగా లేని ఇంజెక్షన్ సూదుల వల్ల, ముళ్ళు, సూదులు గుచ్చుకోవడం వల్ల, పొడుచుకోవటం వల్ల అయిన గాయాల వల్ల ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. శరీరంలోని వేడి వల్ల కూడా రావచ్చు (ప్రజలు చెప్పే కారణం).
- ముందు జాగ్రత్తలు: పరిసరాలు శుభ్రంగా ూంచుకోవాలి. పశువులకు వాడే పరికరాలు శుభ్రంగా ూండేట్టు చూడాలి. తగినంత మేత ఇవ్వాలి. గాయాలను శుభ్రంగా కడగాలి.
- హెచ్చరిక: కణితి / కాయ / గెడ్డను పగలగొట్టాలని చూడకండి. ఒక కాయ నుండి వచ్చిన చీము అనేక కాయలను / గెడ్డలను కలిగిస్తుంది. వారం రోజులలోగా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి.
ప్రథమ చికిత్స:
కణితి / కాయలు / గెడ్డ అయిన చోట
నాటు వైద్యం
1. ఈ కింది పూతలలో దేనినయినా ఒకదాన్ని రాయండి.
– తాజా పసుపు, గంధం కలిపిన ముద్ద / జిల్లేడు ఆకులు దంచి చేసిన ముద్ద రాయండి లేదా కొలపలి / తంటెం మొక్క పాలు తీసుకుని వాపు మీద రాయండి. చీము బయటకు వస్తుంది. అప్పుడు ఆవు వెన్నను, పసుపును కణితి మీద రాయండి.
– కోలతపి ఆకులు, పసుపు, ూప్పు కలిపి దంచి కణితి మీద రాయండి.
– సున్నపు తేటను నిమ్మరసంతో కలిపి పూయండి. వేపాకులను దంచి చేసిన ముద్ద, పూదీనా ఆకులు దంచి చేసిన ముద్ద, రెండు మూడు తమలపాకులు కణితిమీద కట్టు కట్టండి.
¬మియోపతి:
ఎకినేషియా క్యూ: కణితమీద ఈ టించర్‌ను పోయండి.
ఇంగ్లీషు మందు : టించర్ అయోడిన్‌ను పదిరోజుల పాటు కణితిమీద పూయండి.
కాపు: వేడి కాపడం పెట్టండి.
నోటి ద్వారా మందులు:
¬మియోపతి: కణుతులు, కాయలు లేదా గెడ్డలు గట్టిగా, వేడిగా, నొప్పిగా వుంటే – ఆర్నికా 200 రోజుకి 3 సార్లు, ఫెర్రంఫాస్ 200 రోజుకి ఒకసారి. ఎకినేషియా 200 రోజుకి 3 సార్లు, ఈ మందులను 2-3 రోజుల పాటు వాడండి. కణితి లలేదా కాయమెత్త పడినప్పుడు. హెపర్సల్ప్ 6 ఎక్న్ రోజుకు రెండుసార్లు ఇది చీము బయటకు రావడానికి పని చేస్తుంది. చీము పూర్తిగా వెళ్ళిపోవడానికి సిలీకియా 200 ఒక డోసు.
నీరు గంతి / నీరు కణితి / నీటి గడ్డ
లక్షణాలు: వాపు, నీటితో నిండి ూంటుంది.
ముట్టుకుంటే చల్లగా ూంటుంది. మెత్తగా గుండ్రంగా ూంటుంది, కదులుతుంది.
నెమ్మదిగా పెరుగుతుంది.
కారణాలు: శరీరంలోపల, బయట సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే జబ్బులు
ప్రథమ చికిత్స
ఈ క్రింది పూతలేవయినా పూయండి.
టీ ఆకులు, గంధపు ముద్ద, నీరు కణితి చుట్టూ తమలపాకు కట్టడం.
టించర్ అయోడిన్
హెచ్చరిక: వారం రోజులలోగా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి.
నీరు దిగుట
లక్షణాలు: ఇంటి వంటి మీద ఎక్కువ చోట్ల వ్యాపించే వాపు. శరీరంలోపలి సమస్యల వల్ల ఇది వస్తుంది.
నీరు దిగిన వాపు మీద కనుక వేలును గుచ్చి తేసేస్తే, గుచ్చినచోట ఏర్పడ్డ లోతు అలాగే ూంటుంది. చర్మం మళ్ళీ వెనక్కి మామూలుగా రాదు.
పశువులలో ఈ రకం వాపునకు సాధారణమైన ూదాహరణ గొంతు కింద నీళ్ళు దిగడం. ఇది రక్తహీనత చాలా అధికంగా ూంటే, మాసంకృత్తులు లోపిస్తే వస్తుంది.
కారణాలు:
రక్తప్రసార వ్యవస్థలో సమస్యలు
బాగా రక్తహీనత ూండడం
మాంసకృత్తుల లోపం
పొట్టలో పురుగులు, నట్టలు ూండటం.
ముందు జాగ్రత్తలు:
పశువుకు అన్ని పోషక విలువలున్న సమతుల ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చిమేత తినిపించాలి. ముఖ్యంగా మునగ ఆకులు, పప్పు ధాన్యాల గడ్డిని, తవుడు, పప్పులు, తెలకపిండి తినిపించాలి. క్రమం తప్పకుండా అప్పుడప్పుడు నట్టల మందు వేయాలి.
ప్రథమ చికిత్స: పొట్టలో పురుగులు, నట్టలు ూండడం వల్లనే ఈ వాపు వచ్చినట్టయితే, నట్టల మందు తప్పకుండా వేయాలి. అయినా నీరు దిగడం అలాగే ూంటే వైద్యుల సహాయం వాసుకోవాలి.
నీరు గంతికి నీరు దిగడానికి తేడాలు
నీరు దిగుట | నీరు గంతి |
1. వాపు మీద వత్తినప్పుడు ఆ భాగం చర్మం లోపలికి పోయి అలాగే నిలబడుతుంది. వెంటనే వెనక్కి రాదు. | 1. వాపు మీద ఒత్తినప్పుడు ఒత్తిన భాగం వెంటనే మామూలుగా వచ్చేస్తుంది. |
2. వాపు చాలా భాగంలో వ్యాపిస్తుంది. | 2. వాపు గుండ్రంగా, బంతి ఆకారంలో ూంటుంది. |
3. రక్తం లేకపోవడం వల్ల, మాంసకృత్తుల లోపం వల్ల, రక్త ప్రసరణ వ్యవస్థలోని లోపాల వల్ల, జీర్ణకోశ వ్యవస్థలోని నట్టలు పురుగుల వల్ల ఇది వస్తుంది. | 3. కణితిలోపల నీరు ూంటుంది.4. ముట్టుకుంటే మెత్తగా, చల్లగా ూంటుంది. |
గెంతి / కణితి
ఇవి పెరుగుతూ పోతుంటాయి. గుండ్రంగా పెరగవు. చాలా పెద్దగా అవుతాయి. వీటికి వైద్యం కష్టం. కొన్ని శరీరంలో ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. కొన్ని ఆ భాగానికి మాత్రమే పరిమితమవుతాయి. ఆ భాగానికి మాత్రమే పరిమితమయ్యే గెంతుల చికిత్స సులువు.
లక్షణాలు:
1. శరీరంలో ఒకచోట మాంసం అడ్డులేకుండా పెరిగిపోవడం. ఆ పెరుగుదల వల్ల శరీరానికి ఎటువంటి ూపయోగమూ ూండదు.
2. వాపును ముట్టుకుంటే చల్లగా ూంటుంది.
3. చాలా నెమ్మదిగా పెరుగుతుంది.
4. సాధారణంగా ఇటువంటి గెంతులు నొప్పి ూండవు.
5. సాధారణంగా మెడ దగ్గర, చెవుల దగ్గర, కాళ్ళ దగ్గర పెరుగుతాయి.
గెంతులకు ూదాహరణలు:
1. కొమ్ము క్యాన్సర్
2. ూలిపిరి / ూలిపిరి కాయలు.
1. కొమ్ము క్యాన్సర్ లక్షణాలు: కాలిఫ్లవర్ / గోబిపువ్వు వంటి ఆకారంలో ూన్న కాయ / గడ్డ, చాలా సులువుగా దీని నుంచి రక్తం కారుతుంది.
ప్రథమ చిత్స: ఆపరేషన్ ద్వారా తీసేయాలి. కేసును డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళండి.
2. ూలిపిరి / ూలిపిరి కాయలు:
ప్రథమ చికిత్స:
నాటు వైద్యం : ూలిపిరి లేదా ూలిపిరి కాయ మొదలులో దారంతో కానీ, గుర్రం లేదా ఆవు వెంట్రులు మూడు నాలుగు కలిపి కానీ కట్టండి. దీని వల్ల ూలిపిరి కాయకు రక్తం సరఫరా ఆగిపోతుంది. అప్పుడది ఎండిపోయి రాలిపోతుంది.
ూలిపిరి కాయలకు ఈ కింది మందులలో దేనినయినా రాయండి.
1. బొప్పాయి పాలు, పండు లేదా ఆకులను ూలిపిరి మీద అద్దండి. ూలిపిరి రాలిపోయేదాకా రోజుకు రెండుసార్లు ఇలా చేయండి.
2. ూలిపిరి కాయ చుట్టూ తమలపాకు నొకదాన్ని బ్యాండేజీ లాగా కట్టండి. ఆకు కదలకుండా ఒక దారం కట్టండి. ూలిపిరికాయ రాలిపోయేదాకా రోజుకు రెండుసార్లు ఆకు మార్చండి.
3. రెండు మూడు వెల్లుల్లి / తెల్లగడ్డపాయలను దంచి నేరుగా ూలిపిరి కాయమీద పిండండి. ూలిపిరి కాయ రాలిపోయే దాకా రోజుకు ఒకసారి ఇలా చేయండి.
4. కాపర్ సల్ఫేట్ రెండు మూడు ముక్కలు చుక్క నీటిలో కలపండి. అగ్గిపుల్ల ూపయోగించి ూలిపిరి కాయమీద దాన్ని పూయండి.
జాగ్రత్త: కాపర్సల్ఫేట్ మీ వేళ్ళను కాలుస్తుంది.
¬మియోపతి:
నీటి ద్వారా : తుజా 200 రోజుకు ఒక డోసు చొప్పున పది రోజుల పాటు ఇవ్వండి.
గమనిక: పైన చెప్పిన చిన్న ూలిపిరికాయలకు మాత్రమే, పెద్ద ూలిపిరి కాయలకు, వాపులకు పశువైద్యులను సంప్రదించాలి.
Tag:Telugu, పశువులలో వాపులు