పత్తి తీతలో మెళకువలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
పత్తిలో పూత దఫాలుగా రావడం వలన ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వుంటుంది. సరైన పద్దతులు అవలంబించనట్లయితే పత్తి ధర పలకదు. పత్తి తీసే కూలీలకు ఈ విషయంలో శిక్షణ అవసరం.
పత్తి తీసేటపుడు జాగ్రత్తలు:
1. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి.
2. ఎండిన ఆకులు, చెత్త కలువనీయకూడదు
3. పింజ పొడవును బట్టి ధర పలుకుతుంది. కాబట్టి ఏ రకానికి ఆ రకం మండెలు కట్టి అమ్ముకోవాలి.
ఎం.సి.యు -5, సవిత, డి.సి.హెచ్. 32 వంటి రకాలకు ఎక్కువ ధర లభిస్తుంది.
4. గుడ్డి పత్తిని విడిగా సేకరించాలి.
పత్తి నిల్వలో మెళకువలు:
1. మంచు కురిసే ఉదయం వేళలో పత్తి తీయరాదు. తడిగా వున్న పత్తిని ఆరబెట్టి నిల్వ చేయాలి.
2. నిల్వ చేసిన పత్తికి గాలి తగిలేట్టు, తేమ తగలకుండా చూడాలి.