నేల ఉసిరి
నేల ఉసిరి
ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా బీడు భూముల్లోనూ, పంటపొలాలలోనూ, కొద్దిగా తేమ ఉన్న ప్రాంతాలలోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్క అన్ని భాగాలను వైద్య పరంగా ఉపయోగి స్తారు. ఈ మొక్క కషాయాన్ని కామెర్ల వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధుల నివారణలో కూడా వాడుతారు.
నేల ఉసిరి మొక్కలో ఉన్న రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహాకరంగా పనిచేస్తాయి. నేల ఉసిరి మొక్కను వివిధ రకాల ఆకుల కషాయం తయారీలో వుపయోగించవచ్చు. వివిధ రకాల ఆకుల కషాయం పురుగులపై ఒక శక్తివంతమైన కీటక నాశనిగా పనిచేసి పురుగులను సమర్ధవంతంగా అదుపులో వుంచుతుంది.
నేల ఉసిరి మొక్క ద్రావణానికి విత్తన నిల్వలో ఆశించే ఎర్ర పిండి పురుగులను నివారించే శక్తి ఉన్నట్లు డా|| కన్నా (ఉత్తరప్రదేశ్, 2003) పరిశోధనలతో నిరూపితమైంది.
దోమల గ్రుడ్లను మరియు లార్వాలను నిర్మూలించే గుణం నేల ఉసిరి మొక్క ద్రావణానికి వుందని డా|| గోవింద రాజన్ (తమిళనాడు 2011) పరిశోధనలు సూచిస్తున్నాయి.
నేల ఉసిరి మొక్క ద్రావణానికి పేనుబంక, తామరపురుగు, రసం పీల్చే పురుగులను నివారించే శక్తి ఉన్నట్లు డా|| రఘునాథ్ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ మొక్క కషాయాన్ని పశువులకు వచ్చే పుండ్ల నివారణలో కూడా వుపయోగించవచ్చని డా|| గాబ్రి (2008) పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ మొక్కపై ఇంకా పరిశోధనలు జరగవలసి వున్నది.
Tag:నేల ఉసిరి