తేలు కుట్టితే – నివారణ
తేలు కుట్టితే – నివారణ
కొన్ని తేళ్ళు మరికొన్నిటికంటే ఎక్కువ విషపువి. ఐదేళ్ళలోపు పిల్లలకు తలమీదగాని, ఛాతిమీద గాని, పొట్టమీద గాని, వీపు మీద గాని కుడితే చాలా ప్రమాదం.
పెద్దలల్లో మొదటిసారి తేలు కాటేస్తే ప్రమాదమేమీ వుండదు. రెండవ సారి కుట్టినప్పుడు వెంటనే వైద్యం చెయ్యకపోతే ప్రమాదం. మొదటి సారి కుట్టినప్పుడు శరీరంలోకి విషం వెళ్ళి శరీరం ఎర్జిక్గా అవుతుంది. అంచేత తేలు కుట్టిందని ఎవరైనా వస్తే ఇంతకు ముందెప్పుడైనా తేలు కుట్టిందేమో తొసుకోవాలి. రోగికి షాక్ చిహ్నాులు కాని, హార్ట్ ఫెయిల్స్ చిహ్నాలు కాని కఫంలో రక్తంకాని వున్నాయేమో చూడాలి.
ఏం చెయ్యాలి?
పెద్ద వాళ్ళకు మొదటి సారి కుడితే…
- ఏస్పిరిన్ ఇచ్చి, తేలు కుట్టిన చోట ఐస్ పెట్టాలి.
- నోవాకైన్ 5-10 మి.లీ. తేలు కుట్టినచోట చుట్టూ ఇంజక్ట్ చెయ్యాలి. అలా చేసినందు వల్ల తాత్కాలికంగా బాధ తగ్గుతుంది.
- ఏంటీహిస్టిమిన్ మాత్రలు కూడా ఇవ్వాలి. పెద్ద వాళ్ళకు రెండవ సారి కుడితే, 5 సంవత్సరాలోపు ప్పిల్లలకు కుడితే గాని ఈ క్రింది విధంగా చెయ్యాలి.
- వెంటనే వైద్య సహాయం పొందాలి:
- ఊపిరి ఆగిపోయినట్లయితే నోటి మీద నోటి నుండి గాలి ఊదాలి.
- రోగి బలమైన షాక్లో వుంటే, షాక్కు వైద్యం చెయ్యాలి.
- మరీ చిన్న పిల్లవాడికి తేలు కుడితే గాని శరీరంలో ప్రధాన భాగంలో తేలు కుడితే గాని లేక రెండవ సారి కుడితేగాని వెంటనే వైద్య సహాయం పొందాలి.
- పెద్ద వాళ్ళకు తేలు కుడితే ఇంటి వైద్యం గురించి తొసుకోవాంటే
తేనెటీగలు, కందిరీగలు కుడితే
ఇవి కుడితే ప్రమాదమేమీ కాదుగాని బాగా నొప్పిపుడుతుంది. కొంతమంది ‘ఎర్జిక్ షాక్’ వస్తుంది. ఇవి కుట్టిన చోట ఎర్రగా వాచి, వేడి గాను, నొప్పిగానూ వుంటుంది.
వైద్యం
1 కుట్టినచోట వేడినీళ్ళ కాపడం పెట్టాలి.
2 ఏస్పిరిస్ ఇస్తే నొప్పి తగ్గుతుంది. ఏంటీహిస్టమిన్ మాత్రలు ఇస్తే ఎలర్జీ రాకుండా వుంటుంది.ఙ షాక్ చిహ్నాలు కనిపిస్తే, ‘ఎలర్జిక్ షాక్’కి చేసే వైద్యమే చెయ్యాలి.