తంగేడు
తంగేడు
ఈ మొక్కలో హెక్సైల్ థాలేట్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఏంటి ఆక్సిడెంట్స్, ఆంత్రాక్వినాన్స్ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి.
తంగేడు ఆకులను/ కొమ్మలను పొలాలలో పచ్చి ఆకు ఎరువుగా ఆదివాసీ ప్రాంత రైతులు వినియోగిస్తున్న విషయం ప్రత్యక్షంగా ఈ రచయిత చూశారు. రైతులు పంట పొలాలలో పచ్చిరొట్ట పంటలైన అవిశ, పిల్లి పెసర, జనుము మొ|| వేసుకోవటం కుదరని పరిస్థితులలో తంగేడు మొక్క లేత కొమ్మలను, ఆకులను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఒక ఎకరా పొలానికి సుమారు ఒక టన్ను వరకు తంగేడు కొమ్మలు అవసరం పడతాయి.
ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు సేంద్రియ ఎరువులు అందించే సులువైన పద్ధతి. ఈ మొక్క భాగాలు నేలలోని తేమ సరిపడినంత వున్నప్పుడు త్వరగా కుళ్ళి, మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతాయి. తద్వారా పోషకాలు ప్రధాన పంటకు అందుతాయి. తంగేడు ఆకులలో సుమారు 1.6 శాతం నత్రజని, 0.3 శాతం భాస్వరం, మరియు 1.2 శాతం పొటాష్ వుంటుంది.
బి) సస్యరక్షణలో:
తంగేడు మొక్క ఆకులలో ఉన్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువల్ల ఆకులను సస్యరక్షణలో, ”పంచపత్ర కషాయం”లో ఉపయోగించి పంటలను ఆశించే రసం పీల్చే పురుగులపైన మరియు చిన్న చిన్న లార్వాల పైన (ఆకులను తినే గొంగళి పురుగులు) వాడి, వాటిని సమర్ధవంతంగా నివారించవచ్చని రైతుల అనుభవం.
తంగేడు ఆకు కషాయానికి అపరాల నిల్వలో వచ్చే పుచ్చు పురుగులను నివారించే గుణం ఉందని డా|| జయకుమార్ (తమిళనాడు) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. తంగేడు ఆకు కషాయానికి పంటలలో వచ్చే బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగుళ్ళను నియంత్రించే లక్షణాలు ఉన్నాయని తమిళనాడు శాస్త్రజ్ఞుల పరిశోధనలలో నిరూపితమైంది.
Tag:తంగేడు