జొన్నలో కాండం తొలుచు ఈగ
జొన్నలో కాండం తొలుచు ఈగ
పురుగు ఆశించు కాలం: జూన్ – జులై
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తట్టుకునే రకాలైన సి.ఎస్.హెచ్ 17, ఎన్.టి.జె 4 రకాలను విత్తుకోవాలి.
- జూలై15 లోపు విత్తుకోవడం ద్వారా పురుగు తాకిడి నుంచి తప్పించుకోవచ్చు.
- ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేసుకోవాలి.
- పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా ఏరి నాశనం చేయాలి.
నివారణ :
- ఎక్కువ విత్త్తనం నాటుకొని దెబ్బతిన్న మొక్కలను ఏరి నాశనం చేయాలి.
- తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడానికి 5 శాతం వేప కషాయం పిచికారి చేయాలి.
- పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే అగ్నిహస్త్రం పిచికారి చేసుకోవాలి.
Tag:కాండం తొలుచు ఈగ, నివారణ