జీవామృతం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
జీవామృతం
జీవామృతం తయారీకి అవసరమైన ముడి సరుకులు:
ఆవు పేడ 10 కిలోలు
ఆవు మూత్రం 10 లీటర్లు
నల్ల బెల్లం 2 కిలోలు
శనగ పిండి 2 కిలోలు
ప్లాస్టిక్ డ్రమ్ము 200 లీటర్లది
తయారు చేసే విధానం:
పెద్దపాత్రలో 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దానికి 10 కిలోల పేడ కలపాలి. కట్టెతో దాన్ని బాగా కలియబెట్టాలి. దానికి మెత్తగా పొడి చేసిన బెల్లం (2 కిలోలు), శనగపిండి (2 కిలోలు) కలపాలి. దానికి 10 లీటర్ల పశువుల మూత్రాన్ని పిడికెడు మట్టిని కలిపి బాగా కలియబెట్టాలి. పాత్రపై గోనెసంచి కప్పిఉంచి, వారం రోజులు పులియబెట్టాలి. రెండు మూడు రోజులకొకసారి కట్టెతో కలియబెడుతుండాలి.
జీవామృతాన్ని తయారు చేసిన 2-3 రోజుల్లో కూడా వాడుకోవచ్చు.
వారంలో జీవామృతంలో సూక్ష్మజీవులు పూర్తిస్థాయికి వృద్ధి చెంది ఉంటాయి. దీనిని సన్నని ధారగా పొలానికి వెళ్ళే నీటితో కలిసేట్టు చూడాలి. దీనిని వడగట్టి స్ప్రింక్లర్ లేదా డ్రిప్ లో కూడా నీటికి కలుపవచ్చు.
పెద్దపాత్ర అందుబాటులో లేకుంటే చిన్నగుంత పొలంలో తవ్వుకొని, దాని లోపలభాగం చదునుచేసి, పేడతో అలికి, పేడనీటిలో 24 గంటల పాటు నాననిచ్చి, ఒకరోజు ఆరబెట్టాలి. మరుసటి రోజు జీవామృతం దానిలో చేసుకోవచ్చు.
మోతాదు:
ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని సాగు నీరు ద్వారా అందించవచ్చు. లేదా సాగు భూమి పైన జల్లవచ్చు.