గ్రామీణ ప్రాంతంలో ప్రమాదాలు – జాగ్రత్తలు ఎక్ట్రికల్ షాక్ లేక కరెంటు షాక్
గ్రామీణ ప్రాంతంలో ప్రమాదాలు – జాగ్రత్తలు
ఎక్ట్రికల్ షాక్ లేక కరెంటు షాక్
కేబుల్ లేక ఇన్సులేటర్తో కప్పబడని కరెంటు తీగలను ఎవరైనా ముట్టుకుంటే ఎక్ట్రికల్ షాక్ తగులుతుంది. సవ్యంగా లేని ఎక్ట్రికల్ కలెక్షన్లు, స్విచ్చిు, ప్యూజు లేక కరెంట్ తీగల్లో నుండి బయటకు వచ్చిన కరెంటు, ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు గాయాన్ని కలుగజేస్తాయి. తడిగా వున్నప్పుడు కరెంటు వేగంగా పాకుతుంది. కనుక నీళ్ళలో వున్న వ్యక్తికి అది మరీ ప్రమాదకరం.
ఎక్ట్రికల్ షాక్ అత్యవసర పరిస్థితి లేక ఎమర్జన్సీ. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ సేపు కరెంటును ముట్టుకుంటే అతను బ్రతికే అవకాశం అంత తక్కువ.
ఎక్ట్రికల్ షాక్ ప్రభావాలు:
1. శ్వాసకు కారణమయిన మెదడు భాగాన్ని నాశనం చెయ్యొచ్చు (మెదడులో శ్వాస కేంద్రం) ఆ వ్యక్తి ఊపిరి తీసుకోవడం ఆపేయవచ్చు.
2. శ్వాస తీసుకోవడానికి వుపయోగించే కండరాలు చచ్చుబడిపోవచ్చు.
3. గుండె రక్తాన్ని పంప్ చెయ్యడం ఆపేయవచ్చు. లేక గుండె కండరాలు అదరడం మొదలు పెట్టి గుండె సమర్ధంగా రక్తాన్ని పంప్ చెయ్యలేకపోవచ్చు.
4.గుండె కొట్టుకుంటూనే వుండొచ్చు. కానీ ఊపిరి తీసుకోవటం ఆగిపోవచ్చు. అలా జరిగినప్పుడు ముఖం నీలంగా అవుతుంది.
కరెంట్ శరీరంలో ప్రవేశించిన చోట, బయటకు విడిచివెళ్ళినచోట కావచ్చు.
ఏమి చెయ్యాలి?
తెలివిగా, చురుగ్గా వ్యవహరించడం అవసరం. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని ముట్టుకోగూడదు. ముఖ్యంగా కరెంటుని ఇంకా ఆ వ్యక్తి ముట్టుకునేవున్నప్పుడు, మీరు గనుక ముట్టుకుంటే మీకు కూడా ఎక్ట్రిక్ షాక్ వస్తుంది.
బాధిత వ్యక్తి ఇంకా కరెంట్ తీగను ముట్టుకునే వుంటే కరెంట్ స్విచ్చిని ఆపు చెయ్యండి. స్విచ్చి కనపడకపోతే పొడి బల్ల మీద నుంచుని లేక రబ్బరు చెప్పుల్ని వేసుకుని పొడికర్ర లేక వాసం కర్రతో ప్లగ్‌ని తీసేయడం గాని, కత్తిరించడం గాని చెయ్యండి. కత్తెర, కత్తి లేక లోహంతో చేసిన దేనినీ వుపయోగించకండి.
కరెంట్‌ని ఆపు చేసే విధానమేమీ లేకపోతే, పొడి వాకింగ్ స్టిక్ లేక వాసం కర్ర లేక చెక్కతో ఆ వ్యక్తిని దూరంగా లాగండి. మీద చేతుకు మందపాటి రబ్బరు గ్లవ్స్, పొడిగుడ్డ లేక అనేక పొరలున్న మందపాటి కాగితం లేక న్యూస్ పేపర్‌తో పట్టుకుని కూడా అతనిని లాగవచ్చు. లేక పొడి కర్రకు ఒక తాడును వుప్లాగా కట్టి దానిని బాధితుడి కాలికి లేక చేతికి వేసి దూరంగా లాగండి.
ఒకసారి ఆ వ్యక్తి కరెంటుకు దూరంగా భద్రంగా జరిగాక, అతను ఊపిరి తీసుకోకపోయినా, అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయినా లేక గుండె బలహీనంగా కొట్టుకుంటున్నా వెంటనే అతని నోటి మీద నోరు పెట్టి ఊపిరి అందించాలి. కార్డియూక్మసాజ్ చెయ్యాలి. అతనిని హాస్పటల్‌కు తరలించేటప్పుడు కూడా ఆక్సిజన్ లోపం వల్ల మెదడు ఇంకా దెబ్బతినకుండా వుండేందుకు అలా చెయ్యడం కొనసాగించాలి.