కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం
కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం
దీనిని స్ప్రే చేయడం పూత పిందె బాగా వస్తుంది
“వరిలో గింజ నాణ్యత” పెరుగుతుంది
కావలసినవి:-
12 కోడి గుడ్లు
నిమ్మకాయలు
నల్లబెల్లం
12 కోడిగుడ్లు ఒక పాత్రలో పెట్టి
అవి మునిగే దాక నిమ్మరసం పోయాలి
తరువాత మూత పెట్టి 10 రోజుల పాటు ఉదయం సాయంత్రం మూత తీసి పెట్టాలి లేదా పగిలి పోతుంది
10 రోజులకు గుడ్డు అందులో కరిగిపోతుంది
తరువాత దానిని వడపోస్తే లీటరు వస్తుంది( రెండు ఎకరాలకు సరిపోతుంది) దానికి 250 గ్రాములు నల్లబెల్లం లేదా మామూలు బెల్లం కలిపి స్ప్రే చేయాలి బెల్లం కలపడం వలన నిల్వ ఉంచుకోవచ్చు ( రెండు నెలలు)
పది రోజులలో ఎప్పుడైనా నిమ్మరసం తగ్గితే మళ్లీ గుడ్లు మునిగే దాకా మరింత పోయాలి, పెద్ద పాత్ర వాడండి పాత్ర లో 30 % ఖాళీ ఉండాలి. నిమ్మరసం మాత్రమే పోయాలి
(వాడే విధానం:-100. లీ నీటిలో 250 మిల్లీ లీటర్లు వాడాలి)