కుంకుడు
కుంకుడు
కుంకుడు చెట్లు సుమారు 8-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. పత్రాలు కణుపునకు రెండు చొప్పున దీర్ఘ అండాకారంలో వుంటాయి. ఫలాలు గుండ్రంగా వుండి, ఎండినపుడు తేనెరంగులో గానీ లేత నలుపు రంగులో గానీ వుంటాయి. కుంకుడు చెట్టు ఆంధ్రప్రదేశ్ అంతటా వుంటుంది.
ఈ మొక్క ఫలాలలో ‘సాపోనిన్స్’ వంటి నురుగు పుట్టించే పదార్థాలు వున్నాయి. కుంకుడు కాయ నురుగుకు స్వల్పంగా కీటక నాశన లక్షణాలు వుంటాయి. పంటల సస్యరక్షణలో వుపయోగించే కషాయాల తయారీలో
(ఉదా: వేప కషాయం, వావిలాకు కాషాయం మొదలైన వాటిలో) సబ్బు పొడికి బదులు దీనిని వాడుకోవచ్చు. సుమారు 100 లీటర్ల మందు ద్రావణానికి అర కిలో కుంకుడు కాయల రసం కావలసి వస్తుంది. (అరకిలో కుంకుడు కాయలను పొడిచేసి, సుమారు రెండు లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి, మర్నాడు ద్రావణాన్ని బాగా పిసికి కుంకుడు రసం తీయాలి)
Tag:కుంకుడు