కత్తెర పురుగు
కత్తెర పురుగు
పురుగు ఆశించు కాలం: జూన్ – డిసెంబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఎరపంటగా ఆముదాన్ని గట్లపై నాటుకొని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి. పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పురుగు నివారణకు సరిపోయే లింగార్షక బుట్టలను ఎకరానికి 8 నుంచి 10 వరకు పెట్టాలి. అవి మొక్కజొన్న పంట ఎత్తుకంటే ఒక అడుగు పైకి ఉండేట్టు అమర్చుకోవాలి.
- పంటలో, పంట చుట్టూ నేపియర్ గడ్డి జాతి కలుపు మొక్కలు, ఇతర కలుపు మొక్కలు వుండకుండా చూడాలి.
నివారణ :
- వేసవి దుక్కులు లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు. మొక్కపై గుడ్ల సముదాయాలను లేదా గుంపులుగా చేరి ఆకులను గీకితింటున్న లార్వాలను గమనించినప్పుడు వాటిని ఏరి నాశనం చేయాలి.
- తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయాన్ని పిచికారీ చేయాలి.
- లార్వా చిన్నదశలో నివారించడానికి పచ్చిమిర్చి, వెల్లుల్లి కషాయాన్ని పిచికారీ చేయాలి.
- బ్యాక్టీరియా ఆధారిత బీటీ ఫార్ములేషన్ 2 గ్రాములు లీటర్ నీటిలో లేదా వేప సంబంధిత అజాడిరక్టిన్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి మొక్క సుడులలోపల పడేట్లుగా పిచికారీ చేసుకోవాలి. దీపపు ఎరలు ఏర్పాటు చేయాలి.
- మొక్కజొన్న సుడిలో బురద నీళ్ళు పోసి పురుగుని అదుపు చేయవచ్చు.
- ట్రైకోగ్రామ పరాన్నజీవి ఎకరాకు 1,00,000 (ట్రైకోకార్డ్స్) విడుదల చేయాలి.
Tag:కత్తెర పురుగు