ఎర్రనల్లి – సుస్థిర వ్యవసాయ కేంద్రం
ఎర్రనల్లి
ఇది ఎక్కువగా పత్తి, టమాట, మిరప, కంది, బెండ, మరియు వంగలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇవి ఆకుల అడుగు భాగాన వుండి రసాన్ని పీల్చి వేస్తాయి. ఆకులు వడలి, పసుపు రంగుకు తిరిగి ఎండిపోతాయి. ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి.
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తట్టుకునే రకాలను నాటుకోవడం.
నివారణ :
- నీటిలో కరిగే గంధకం లీటరు నీటికి 3 గ్రాములు పంటపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- 5 శాతం వావిలాకు కషాయం పిచికారి చేయడం.
- 3 శాతం వేపనూనె పిచికారి చేయడం.
- పశువుల పేడ + మూత్రం + ఇంగువ ద్రావణం 2 సార్లు పిచికారీ చేయాలి.
Tag:ఎర్రనల్లి