ఎక్కువ దిగుబడినిచ్చేశ్రీ పద్దతిలో వరి సేద్యం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు
తక్కువ విత్తనం
లేత మొక్కులు నాటటం
దూర దూరంగా నాటటం
తక్కువ నీరు
కలుపును నేలలోకి కలిపివేయడం
సేంద్రియ ఎరువులు వాడకం
శ్రీ పద్ధతిలో వరి సాగుకు మడులను బాగా చదును చేసి మురుగునీరు లేదా ఎక్కువగా ఉన్న నీరు పోయే కాలువను తీసుకోవాలి.
శ్రీ పద్ధతిలో వరి సాగుకు భూమిని సేంద్రీయ ఎరువులతో సారవంతం చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. సేంద్రియ పదార్థం సూక్ష్మజీవుకు ఆహారం కాబట్టి సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలు అందుబాటులోకి తెస్తాయి. కాబట్టి సూక్ష్మజీవు ఉన్నప్పుడు మొక్కు ఆరోగ్యంగా పెరిగి చీడ పీడలను తట్టుకుని ఎక్కువ దిగుబడినిస్తాయి. భూసారాన్ని పెంచడం కోసం చెరువు మట్టి వేయడం, పెంట పోగు ఎరువు, వానపాము ఎరువు, పచ్చిరొట్టపైరు, పశుజీవాలను మందకట్టడం, దభ్కోర్ పద్ధతి, పచ్చి ఆకును తొక్కడం లాంటివి చేయాలి. పంట వేయుటకు ముందు జీవామృతం, అమృతజం, పంచగవ్య లాంటి సేంద్రియ ద్రవ ఎరువులను పంట కాలంలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
నారు పెంచడం
శ్రీ పద్ధతిలో 8-15 రోజు (2 లేదా 3 ఆకు మొక్క) నారు నాటాలి కాబట్టి నారుమడి తయారీలో, నారు పెంపకంలో తగిన జాగ్రత్తు తీసుకోవాలి. ఎకరా పొంలో నాటడానికి రెండు కిలో విత్తనం సరిపోతుంది. దానికి 44 చదరపు గజా నారుమడి కావాలి. మీనుబట్టి ఒక పెద్దమడి కానీ లేదా చిన్న మడుగా కానీ ఎత్తైన నారు మడు వేసుకోవాలి. నారుమడి చుట్టూ కాువ తీయాలి.
మొక్క వేరు నేలోకి తేలికగా చొచ్చుకొనిపోవడానికి పశువు ఎరువు ఉపయోగపడుతుంది. అంతే గాక కుళ్ళిన ఎరువులో మొక్క పెరిగినప్పుడు రోగ నిరోధక శక్తి పెరిగి తరువాత కూడా మొత్తం పంట ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమంది రైతు మ్యాట్ పద్ధతిలో నారుమడి పెంచి లేత నారును ప్రధాన పొలానికి తీసుకుని వెళ్ళడంలో ఉన్న సమస్యను అధిగమిస్తున్నారు.
కొంతమంది రైతు కలిసి 2-3 నారుమడు వారం లేదా 10 రోజు వ్యవధితో వేసుకున్నట్లయితే నారుమడి 8-15 రోజు మధ్య వచ్చినప్పుడు రైతు నాటు వేసుకోవటానికి వాతావరణం అనుకూలించక పోయినా, పొం సిద్ధంగా లేకపోయినా వేరే నారుమడిని వాడుకోగ్గుతారు. శ్రీ పద్ధతిలో కావసిన విత్తనం, నారుమడికి కావసిన ప్రదేశం తక్కువ కాబట్టి రైతు ఈ విధంగా చేయవచ్చు. కొన్ని ప్రాంతాలో వరిని నేరుగా విత్తే అవాటు ఉంది. మొక్కకు మొక్కకు దూరం పాటిస్తూ ఈ విధానాన్ని శ్రీ పద్ధతిలోనూ అనుసరించవచ్చు.
ప్రధాన పొలం తయారీ:
ప్రధాన పొలం తయారీలో పొలం దున్నడం, దమ్ము చేయడం లాంటివి మామూు పద్ధతుల్లానే చేసి పొం చదునుగా ఉండేటట్లు చేసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీళ్ళు అసు ఉండకూడదు. ముఖ్యంగా బరువు నేల్లో ఎండాకాంలోనే పొడి దుక్కి దున్ని తయారుచేసుకుని నీరు పెట్టి, నాట్లు వేయడం వ్ల తరువాత వీడర్‌ను తేలికగా నడపవచ్చు. పైపైన దున్ని పొం బాగు చేయడం వ్ల వీడర్ దిగబడదు. శ్రమ అనిపించదు. మడు చిన్నగా, చదునుగా ఉంటే నీటి యాజమాన్యానికి అనువుగా ఉంటుంది. నీళ్ళు పెట్టడానికి, తీసేయడానికి అవసరమైతే కాుమ తయారు చేసుకోవాలి. ఉదా:- చౌడు భూము
నాట్లు వేయడం
నారుమడిలో విత్తనం మొకెత్తిన తరువాత రెండు లేదా మూడు ఆకు దశలో ప్రధాన పొంలో నాట్లు పెట్టినచో పిక సంఖ్య ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. పిక గురించి మాట్లాడుతున్నప్పుడు ‘ఫిల్లోక్రాన్’ గురించి అర్థం చేసుకోవాలి. ఫిల్లోక్రాన్ అనేది ఒక ఆకు, వేరు వేయడానికి పట్టే సమయం. అన్ని పరిస్థితు అనుకూంగా ఉంటే ఐదు రోజుల్లో ఒక ఫిల్లోక్రాన్ దశ ముగుస్తుంది. వరి మొక్క శాఖీయ దశ పూర్తిచేసుకుని చిరు పొట్ట తగిలే నాటికి 12 ఫిల్లోక్రాన్ దశు పూర్తి చేస్తే మంచిది. కొత్త పిక రెండు ఫిల్లోక్రాన్ దశు పూర్తిచేసుకుంటే అవి కూడా పికు పెట్టడం మొదుపెడుతుంది. అంటే కొత్త పిక సంఖ్య వేగంగా పెరుగుతుంది. సాధారణంగా రైతు 30 రోజు వరకు నారుమడిలోనే ఉంచడం వ్ల వరి మొక్క ఈ ఫిల్లోక్రాన్ దశను కోల్పోయి ప్రధానపొంలో నాటు పెట్టిన తర్వాత చాలా తక్కువ పికు పెడుతుంది. కాబట్టి వరి మొక్క మూడవ ఆకు దశలో ఉన్నప్పుడు ప్రధాన పొంలో నాట్లు పెట్టడం వ్ల ఎక్కువ పికు వస్తాయి.
నారుమడి నుంచి నారును తీసిన తరువాత మొక్కకు ఎటువంటి అదురు, ‘షాక్’ తగుకుండా చూసుకోవాలి. వరి మొక్కను సాధారణంగా రైతు నాట్లు వేసినప్పుడు మొక్క వేర్లు ‘ఏ’ అక్షర ఆకారంలో తిరుగుతుంది. అంటే వేళ్లు ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీని వ్ల మొక్క వేరు మళ్ళీ కిందకు దిగి, మొక్క నిదొక్కు కోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వరి మొక్కను పైపైన, వేళ్ళు ‘ఉ’ అక్షర ఆకారంలో ఉండేలా నాటాలి. ఇలా చేస్తే నారు తొందరగా నిదొక్కుకుని ఆరోగ్యంగా పెరుగుతుంది. లేత నారు, ఒక్కొక్క మొక్క నాటడం శ్రీ పద్ధతి ప్రత్యేకత. నారు మడిలో నుంచి మొక్కను తీసుకువచ్చి ప్రధాన పొంలో నాటేటప్పుడు మొక్కకు అదురు, షాక్ తగకుండా చూసుకోవాలి. శ్రీ పద్ధతిలో నారు మొక్క చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మందపాటి ఇనుపరేకును మడిలో అడుగు భాగానికి ( 3-4 ఆంగుళా కిందినుంచి) చొప్పించి నారును మట్టితో పాటు పైకి లేపాలి. నారు పీకిన తరువాత సాధ్యమైనంత త్వరగా (వీలైతే అరగంట లోప) నాటు వేస్తే మొక్క దెబ్బతినకుండా ఉంటుంది.
లేత నారును రైతు అనేక కారణా వ్ల సమయంలో నాట్లు వేయలేకపోవటాన్ని అధిగమించుటకు కొంతమంది రైతు కలిసి వారం రోజు వ్యవధిలో 3-4 నారుమడు పెంచుట వన ఒక నారుమడిలోని నారును సమయానికి వేయలేనప్పుడు వేరొక నారుమడిలోని నారును వాడుకోవటానికి మీంటుంది.
దారులు వదలడం
వరిలో ప్రతి రెండు మీటర్లకు దారులు వదలడం వరిచేలో గాలి బాగా పోసుకోవడానికి, పురుగులు, తెగుళ్ళ ఉధృతి తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే ముందు పొలమంతా నాటువేసి తరువాత రెండు మీటర్లకు ఒక తాడు కట్టి దానికి రెండు పక్కలా మొక్కలను తీసి మధ్యలో నాటుతారు. ఈ దారులు ఇతర అంతర కృషి పనులకు, పరిశీనలకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
దూరదూరంగా నాటడం:
శ్రీ పద్ధతిలో వరుసలకూ, వరుసలకూ మధ్య, మొక్కలకూ మొక్కలకూ మధ్య కనీసం 10 అంగుళాలు ఎడం వుండేటట్లు చూసుకోవాలి. ఒక్కొక్క కుదురుకి ఒకటి లేదా రెండు మొక్కలను మాత్రమే పెట్టాలి. మొక్కలను వరుసల్లో పెట్టడం, మొక్క మధ్య ఎడం కోసం రైతు చాలా రకాల పద్ధతులను వుపయోగిస్తున్నారు. ఒకతాడుకు కావాల్సిన దూరంలో పుల్ల కట్టి ఒక వరుస తరువాత ఒక వరుస వేస్తున్నారు. ఇలా కాకుండా 10/10 అంగుళాల దూరంలో నాట్లు వేయడానికి మార్కర్లు కూడా దొరుకుతున్నాయి. చాలా ప్రాంతాలలో రైతులు వారి వారి నేలకు అనువైనటువంటి చాలా రకాల మార్కర్లు తయారుచేసుకుంటున్నారు.
వరిలో ప్రతీ 2 మీటర్లకు దారులు వదలాలి. శ్రీ పద్ధతిలో మార్కర్‌తో గుర్తులు పెడుతున్నప్పుడు ప్రతీ 8 వరుసకు 12-14 అంగుళాల దారి వదిలి మళ్ళీ మార్కర్లు లాగాలి. ఈ దారులు నాట్లు వేయడానికి మరియు ఇతర అంతర కృషి పనులకు మీగా ఉంటుంది. వరిచేలో గాలి బాగా పోసుకోవడానికి, పురుగు, తెగుళ్ళ ఉధృతి తగ్గడానికి ఈ దారులు ఉపయోగపడతాయి. గట్లవెంట, దారుల వెంట మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ దారులు కొన్ని సందర్భాల్లో మురుగు నీరు / ఎక్కువైన నీరును తీసేందుకు కూడా ఉపయోగపడుతాయి.
నేరుగా విత్తడం
కొన్ని ప్రాంతాలలో వరిని నేరుగా విత్తే అలవాటు ఉంది. ఈ విధానాన్ని శ్రీ పద్ధతిలోనూ ఉపయోగించు కోవచ్చు. శ్రీ పద్థతిలో నాటు వేసేంత దూరంలో నేరుగా విత్తనం వేయవచ్చు. విత్తనానికి మట్టి పట్టించి, పెళ్ళు (పైల్లెట్స్) చేసి విత్తే ప్రయోగాలు కొన్నిచోట్ల జరుగుతున్నాయి. గొట్టం ద్వారా విత్తనాన్ని కిందకి వదిలే ప్రయోగాలు శ్రమను తగ్గించటానికి ఉపయోగపడతాయి. నాటు నేరుగా విత్తడానికి మాదిరిగానే పొలం తయారు చేసి, మార్కర్లాగి ఉంచుకోవాలి. అంతకు మూడు రోజుల ముందే విత్తనం నానబెట్టి, మండె కట్టాలి. పూసిన విత్తనాన్ని మార్కర్ గీతలు కలిసిన చోట 1-3 వరకు జారవిడవవచ్చు. వెనక ఇంకొక మనిషి సేంద్రియ ఎరువుతో విత్తనాన్ని కప్పుకుంటూ వెళ్ళాలి.
అరటి దొప్పు, ప్లాస్టిక్ ట్రేలలో నారు పెంచినప్పుడు వాటితో పాటే నారును నాటు వేసే పొలానికి తీసుకెళ్ళవచ్చు. మ్యాట్ పద్ధతిలో నారు పెంచినప్పుడు అచ్చుగా నారు లేచి వచ్చి నాటువేసే మడికి తీసుకెళ్ళడం తేలికగా ఉంటుంది.
చౌడు భూమిలో శ్రీ పద్ధతిలో సాగుచేయాల్సి వస్తే తప్పనిసరిగా భూమిని దభ్కోర్ పద్ధతిలోగానీ/ పచ్చిరొట్ట పంటను జనుము, జీలుగ సాగుచేసిన తరువాత భూమిలో కలిపివేసి, కుళ్ళిన తర్వాత శ్రీ పద్ధతి సాగుకి వెళ్ళాలి. లేనట్లయితే భూమిని చౌడు భూములల్లో ఆరబెడుతున్నప్పుడు ఉప్పు లవణాలు పైకి వచ్చి మొక్కులు చనిపోతాయి.