ఇప్ప చెట్టు
ఇప్ప చెట్టు
ఇప్ప లేదా విప్ప సుమారు 15-20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. పత్రాలు శాఖల చివర గుంపుగా ఏర్పడతాయి. పత్రాలు నూగును కలిగి వుంటాయి. పత్రాలు ఫిబ్రవరి నుండి ఏప్రియల్ మాసాలలో చెట్టు నుండి రాలిపోతాయి. పుష్పాలు తెలుపు రంగులో ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. పుష్పాలు మంచి సువాసన (తేనె వాసన) కలిగి ఉంటాయి. ఫలాలు కోలాకారంగా లేత ఆకు పచ్చ రంగులో ఉంటాయి. లేత పసుపు వర్ణం కలిగిన విత్తనాలు తెల్లటి గుజ్జుతో కప్పబడి ఉంటాయి. ఒక్కొక్క ఫలంలో ఒకటి నుండి నాలుగు వరకు విత్తనాలు ఉంటాయి. విత్తనాలు జనవరి – మే మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క అరణ్య ప్రాంతాలలోనూ, బీడు భూములలోనూ పెరుగుతుంది. ఈ మొక్క పత్రాలు, పుష్పాలు, ఫలాలు, బెరడు వైద్య పరంగా ఉపయోగిస్తారు.
పుష్పాలను, విత్తనాలను కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధుల నివారణలో అనాది కాలంగా ఆదివాసీయులు వుపయోగిస్తున్నారు. అదే విధంగా ఈ మొక్క వేరును పాముకాటుకు విరుగుడుగా వుపయోగిస్తారు.
ఇప్ప చెట్టు ఆకులను ‘టస్సార్ పట్టు పురుగు’ లార్వాలను (ూఅ్ష్ట్రవతీaవa ూaజూష్ట్రఱa) పెంచటానికి వుపయోగిస్తారు. ఈ పురుగు గూడు నుంచి వచ్చిన ‘పట్టు’ ముతకగా వుంటుంది. ఇప్ప చెట్టులో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగానూ (రిపల్లెంట్) మరియు కీటక నాశనిగానూ (ఇనెసెక్టిసైడ్) పని చేస్తాయని డా|| ఘోష్ 2007, డా|| దేవానంద్ 2008 పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇప్ప నూనెకు విత్తనం నిలువలో ఆశించే పురుగులను (పెంకు పురుగులు) నివారించే గుణం వుందని డా|| సింగ్ (1987) పరిశోధనలలో తేలింది. ఇప్ప విత్తనాల నుండి నూనె తీయగా వచ్చిన పిండి (ఇప్ప చెక్క)ని సేంద్రియ వ్యవసాయంలో, భూసార అభివృద్ధి కొరకు మంచి ఎరువుగా వినియోగించు కోవచ్చు. ఇప్ప పిండిలో నత్రజని 2.5 శాతం, 0.8 శాతం భాస్వరం మరియు 1.8 శాతం పొటాష్ కలిగి వుంటుంది. అంతే కాకుండా మొక్కల పెరుగుదలకు కావలసిన ఇతర పోషకాలు కూడా వుంటాయి.
Tag:ఇప్ప చెట్టు