ఆకుమచ్చ తెగుళ్ళకు నివారణ ద్రావణం
ఆకుమచ్చ తెగుళ్ళకు నివారణ ద్రావణం మోతాదు : ఎకరం – 60 లీటర్లు (నీరు కలపకుండా చల్లవలయును.)
ముడిసరుకులు : కలబంద ఆకులు (మట్టు) 3 నుండి 5 కెజీలు సీతాఫలం లేక బోగన్ విల్లా (కాగిత పూల చెట్టు), లేక బొప్పాయి చెట్టు లేక రాధామాధవ్ పూల చెట్టు ఆకులు (రెండు రకముల చెట్లు 5 కేజీ చొప్పున) 10 కెజీలు
పసుపు పిండి – 500 గ్రాములు
మట్టి కుండ : పెద్దది (30 లీటర్లు ఆపైన పట్టేది)
ముందుగా కలబంద మరియు సీతాఫలం లేక బోగన్ విల్లా లేక బొప్పాయి లేక రాధామాధవ్ చెట్ల ఆకులలో రెండు రకముల రోలులో వేసి రోకలితో ఆకులు నలిగేటట్లు కొట్టి 30 లీటర్లు నీరు పోసిన కుండలో వేసి కలియబెట్టండి. దీనికి 500 గ్రాముల పసుపు పొడి కలిపి పొయ్యిపై బెట్టి, నాలుగయిదు పొంగులు వచ్చే వరకు కర్రతో త్రిప్పుతూ ఉడకపెట్టండి. వీలయితే సీతాఫలం చెట్టు కొమ్మ కర్ర వాడండి. ఆ తర్వాత ఈ కషాయం వడగట్టి వేరే కుండలో గాని, ప్లాస్టిక్ డ్రమ్ములో గాని పోయండి. వడగట్టగా వచ్చిన ఆకులను మరల కుండలో వేసీ, 30 లీటర్లు నీరు పోసి మరల ఉడకబెట్టి, నాలుగయిదు పొంగుల తర్వాత వడబోసి మొదటి సారి తీసిన కషాయములో పోయండి. ఈ ద్రావణం చల్లారిన తరువాత పంటపై ఏ మాత్రము నీరు కలపకుండా స్ప్రే చేయండి. అవసరమైతే (తెగులు ఎక్కువగా వుంటే) వారానికి ఒకసారైనా స్ప్రే చేయండి.