సి.సి.ఐ.కి వద్దంట… ప్రైవేటుకే పంట! – బి. కొండల్
నిజంగా మార్కెట్ సమస్యల గురించి అధ్యయనం చేయాలని అనుకుంటే కర్నూల్ జిల్లా ఆదోని పత్తి మార్కెట్ ను సందర్శించండి. పత్తి మార్కెట్ సమస్యల గురించి ఏకంగా PHD చేయవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పత్తి మార్కెట్ రోజుకు 15,000 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు వస్తుంది కానీ ఏమి లాభం దీంట్లో CCI ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వారు కొంటున్నది 1000 క్వింటాళ్ల లోపే.అంటే14,000 క్వింటాల్ల కు పైగా ప్రవేటు వ్యాపారస్తులే కొంటున్నారు.ఎందుకు ప్రవేటు వ్యాపారస్తులకు అమ్ముతున్నారు అని రైతులను అడిగితే వారు చెప్పిన బాధలు.
CCI వారు పత్తి కొనాలంటే వారికి తగిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి.
1. మన పంట మొదటగా ఈ క్రాప్ బుకింగ్ జరిగి ఉండాలి.పొరపాటున ఈ క్రాప్ బుక్కింగ్ జరగక పోతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారు జారీ చేసిన ఒక పర్మెట్ లో ఈ రైతు ఇన్ని ఎకరాలు పత్తి వేసిన మాట వాస్తవమే అని గ్రామ VRO,వ్యవసాయ అధికారి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంతకాలతో కూడిన ఫార్మెట్ ఇవ్వాలి. పోనీ ఇదంతా చేసి రైతులు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వారు పేరు నమోదు చేసుకుని ఏ తేదీన పత్తి మార్కెట్ కు తీసుకు రావాలి అన్నది ఫోన్ చేసి చెప్తాము అని పంపుతారు.కొందరు రైతులు మేము అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి 20 రోజులు అవుతుంది మాకు ఇప్పటి వరకు ఫోన్ లేదు,మెసేజ్ లేదు అని అక్కడ కలసిన చాలా మంది రైతులు తమ భాదను వ్యక్తం చేశారు. ఇన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత కూడా ఏ తేదీకి పత్తి కొంటారో తెలియని పరిస్థితి. ఇప్పటికీ రిజిస్టర్ అయిన 600 మందికి ఇంకా తే తేదీన కొంటారు అనే విషయం తెలియదు.ఇప్పుడు నమోదు అవుతున్న వారికి డేట్ ఎప్పుడు వస్తుందో కనీసం అధికారులకు కూడా తెలియటం లేదు. అసలు విషయం ఏమంటే రోజుకు 600 మంది రైతులు పత్తి తీసుకు వస్తుంటే మన CCI 40 మందిది కూడా పత్తి కొనటం లేదు. మా వైపు నుండి డాక్యుమెంట్ ప్రాసెస్ త్వరగా పూర్తి చేస్తాము,CCI వారు ఇలా రోజుకు 40 మందిది కింటే సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అని AMC ( అగ్రి కల్చర్ మార్కెట్ కమిటీ) వారి వాదన,ఇక మేము రోజుకు 40 మందికి మించి కొనకలేము,మేము మూడు జిన్నింగ్ మిల్లుల తోనే ఒప్పందం చేసుకున్నాము.అంతకు మించి స్టాక్ పెట్టుకొలేము అంటారు CCI వారు.కానీ మధ్యలో చాలా నష్ట పోతున్నారు పత్తి రైతులు.కానీ ఇది మరీ అంత పరిష్కారం కానీ సమస్య ఏమీ కాదు.CCI రోజుకు కనీసం 100 మంది రైతుల పత్తి కొనే ఏర్పాటు చేసుకుంటే చాలు వీలైనంత మంది రైతులు పత్తి CCI కి తీసుకు వస్తారు. రైతులు ప్రవేటు వ్యాపారస్తులకు అమ్మటం వలన ఒక్క క్వింటాలు కు కనీసం 500 నష్ట పోయిన రోజుకు 14000 క్వింటాల్లు అంటే ఒక్క పత్తి పంట పైనే రోజుకు ఆదోని మార్కెట్ లోనే 70 లక్షల రూపాయలు నష్ట పోతున్నారు అంటే ఇలా ఎన్ని రోజులు, ఎన్ని లక్షలు నష్ట పోవాలి. తక్షణం CCI కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి.లేదంటే ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యంత పెద్ద పత్తి మార్కెట్ అయిన ఆదోని మార్కెట్ పై CCI పై ప్రజలు విశ్వాసం కోల్పోతారు.ఇక మీడియా మిత్రులు కూడా సమస్య తీవ్రత గురించి మరింత అధ్యయనం చేసి వాస్తవాలు వెలుగు పరిస్తే దానిపై ఒక చర్చ జరిగి ఎక్కువ మంది పత్తి CCI కొని రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.
Tag:Telugu, ప్రైవేటుకే పంట!