వేప
వేప
రైతులు వేప గింజలను మే-జూన్ నెలలలో సేకరించుకొని గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా నిల్వ చేసిన వేప గింజలను సుమారు ఒక సంవత్సరం వరకు వుపయోగించుకోవచ్చు.
నీడలో ఎండిన వేప పండ్ల పొడిని వుపయోగిస్తే 7-10 కిలోల వేపపండ్ల పొడి అవసరమవుతుంది. వేప ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారీ చేసుకోవాలి. నిల్వ వుంచరాదు.
పంట దశను బట్టి, పురుగుల ఉధృతిని బట్టి మోతాదు పెంచుకోవలసి వుంటుంది. వేప ద్రావణాన్ని అన్ని పంటలలోనూ, నారుమళ్ళలోనూ వాడవచ్చునూ. వేప ద్రావణాన్ని పండ్ల తోటలలో కూడా పిచికారీ చేసుకొని మంచి ఫలితాలు సాధించవచ్చు. వేప ద్రావణం చేయగా వచ్చిన పిప్పిని, పెరటి మొక్కలకు, పూల కుండీలకు వాడుకోవచ్చు.
పంట తొలి దశలలో ఆశించే రసం పీల్చు పురుగులు మరియు చిన్న సైజు లార్వాల నియంత్రణలో వేప ద్రావణాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు. పంటల తొలి దశలో (30-45 రోజులు) సుమారు ఎకరాకు 100 లీటర్ల ద్రావణం అవసరమవుతుంది.
పంట పెరిగిన కొలదీ వేప ద్రావణం మోతాదు పెచుకోవలసి వుంటుంది. పంట పూత దశలో పిచికారి చేస్తే రెక్కల పురుగులు వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టవు. గుడ్డు దశ, పిల్ల పురుగుదశలను వేప ద్రావణం నాశనం చేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండడం వలన పిల్ల పురుగులు ఆకులను తినలేవు.
వేపలో ఉండే ‘అజాడిరెక్టివ్’ అనే పదార్థం పురుగు జీవితదశలపై ప్రభావాన్ని చూపిస్తుంది. పురుగు తన జీవితచక్రం పూర్తి చేయలేక లార్వా గానో లేక నిద్రావస్థలోనో చనిపోతుంది. వేప ద్రావణం మన ఆరోగ్యానికి గానీ, మేలుచేసే పురుగులకు గానీ, వాతావరణానికి గానీ హానికరము కాదు. వేప ద్రావణంలో ఉన్న అనేక ‘లిమోనాయిడ్స్’ పంటను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
Tag:వేప