వరిలో సుడి దోమ
వరిలో సుడి దోమ
పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
జిల్లేడు ఆకులకు మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి.
8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:
టూటేరు ఆకు కషాయం సుడి దోమకు సమర్ధవంతంగా పనిచేస్తుంది.
దీపపు ఎరలను ఉపయోగించి సుడిదోమ పెద్ద పురుగులను ఆకర్షించి నాశనం చేయాలి.
ఇసుక 15 కిలోలకి 1.5 లీ. వేపనూనె బాగా పట్టించి, రాత్రంతా వుంచి ఉదయాన్నే పొలంలో చల్లితే పురుగు ఉధృతి తగ్గుతుంది.
Tag:సుడి దోమ