వరిలో ఆకుముడత – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో ఆకుముడత
ఆకు ముడత వేరుశనగ, వరి, పత్తి, కంది,
మరియు కూరగాయలలో ఎక్కువ వస్తుంది.
పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
- 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:
- పొలంపై ఒక ముళ్ళ కంపని లాగుతూ వెళ్ళడం వలన ఆకుముడతలు విడిపోయి లార్వా నీటిలో పడి చనిపోతుంది.
- రెక్కల పురుగులను గమనించినప్పుడు 5శాతం వేప కషాయం పిచికారీ చేయాలి.
- లార్వా చిన్న దశలో అదుపు చేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం పిచికారి చేయాలి.
Tag:ఆకుముడత