మామిడిలో సమగ్ర సస్యరక్షణ
సమగ్ర సస్యరక్షణ
మామిడి పంటను వివిధ దశలో అనేక రకాలైన పురుగులు, తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. మామిడి నాశించే ముఖ్యమైన పురుగులు, తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులు ఈ దిగువన సూచిస్తున్నాం.
మామిడిని ఆశించే పురుగులు – నివారణ:
తేనె మంచు పురుగులు (మాంగో హాపర్స్)
లక్షణాలు :
తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుండి విపరీతంగా రసాన్ని పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినపుడు ఆకుల చివర్లు, అంచులు మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందేలు ఏర్పడవు. ఇంతే కాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై ‘కాప్నోడియం’ మరియు మీలియోలా’ అనే శిలీంద్రాలు పెరగటం వల్ల ఆకులపై, పూత కాడలపై, కాయలపై నల్ల మసి పొర ఏర్పడుతుంది. దీని వల్ల ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి.
నివారణ:
- ఈ తేనెమంచు పురుగులను అదుపులో ఉంచేందుకు 5 శాతం వేపకషాయం పూత మొదలయ్యే సమయంలో పది రోజు వ్యవధిలో 2 సార్లు, పిందెలు తయారయ్యే సమయంలో 2 సార్లు మొక్కపై బాగా పిచికారీ చెయ్యాలి. చెట్టు వయసును బట్టి సుమారు 10 నుండి 20 లీటర్ల మందు ద్రావణం పడుతుంది.
- పశువుల మూత్రం 1 లీటరు, 10 లీటర్ల నీటిలో కలిపి, 1`2 సార్లు 15 రోజు వ్యవధిలో పిచికారీ చేయాలి.
తామర పురుగులు (మంగు – త్రిప్స్)
లక్షణాలు :
తామర పురుగులు 2 మి.మీ. పొడవుండి, చిన్న రెక్కులు కలిగి సూక్ష్మంగా వుంటాయి. ఇవి కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి, రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి ఆ తరువాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై చర్మాన్ని గోకి, బయటకు వచ్చిన రసాన్ని పీల్చి వేస్తాయి. ఇవి ఆశించిన కాయలపై రాతిమంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత పడిపోతుంది.
నివారణ:
ఈ పురుగుల నివారణకు వేపనూనె 2 మి.లీ. లీటరు నీటికి కలిపి కాయపై పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి.
పూత నాశించే పురుగులు
లక్షణాలు :
ఈ పురుగులు పూల గుత్తులను ఆశించి పూతను తిని విపరీతంగా నష్టపరుస్తాయి. ఇది ఆశించిన పూల గుత్తుల్లో పిందెలు ఏర్పడవు.
నివారణ:
ఈ పురుగు నివారణకు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం పూత సమయంలో గుత్తుపై పిచికారీ చేయాలి.
టెంక పురుగు
లక్షణాలు :
టెంక పురుగు వలన కాయ లోపలి భాగం పుచ్చిపోయి కాయలకు నష్టం కలుగుతుంది.
నివారణ:
- కాయ కోత అయిన తరువాత ప్రతి సంవత్సరం మామిడి చెట్టులోని ఎండు పుల్లల్ని , కొమ్మల్ని తొలగించి కాల్చి వేయటం వల్ల చాలా వరకు ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
- పిందెలు గోలికాయ సైజులో ఉన్నప్పుడు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం 10 రోజు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
- తోటల్లో అక్కడక్కడా దీపపు ఎరలు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో చిన్న చిన్న మంటలు వేసి తల్లి పురుగులను నాశనం చేయాలి.
పిండి నల్లి
లక్షణాలు :
భూమిలో పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు చెట్టు పైకి పాకి లేత రెమ్మలు కాయలు, తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి.
నివారణ:
- ఈ పురుగు నివారణకు చెట్ల పాదులో చెట్టు వయస్సును బట్టి 2-5 కిలో వేప పిండి లేదా కానుగ పిండి లేదా ఆముదం పిండి చల్లి మట్టిలో కపాలి.
- ఇవి ఆశించిన కొమ్ము, కాయపై లీటరు నీటికి 2 మి.లీ. వేప నూనె 10 రోజు వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- తొలకరిలో భూమిని చెట్టు మొదలుకి దగ్గరగా దున్నాలి. లేదా పాదులను తవ్వి తిరగెయ్యాలి.
కాయ కొట్టే ఈగ
లక్షణాలు :
ఈ పురుగు ఆశించిన కాయలు తొందరగా మాగి రాలిపోతాయి. తల్లి ఈగలు లేత ఎరుపు వర్ణంతో పారదర్శకమైన రెక్కులు కలిగి ఉంటాయి. ఈ ఈగ కాయ పక్వానికి దగ్గర వచ్చినప్పుడు కాయ చర్మం కింద గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయలోని కండ తిని పెద్దవవుతాయి. ఆలస్యంగా కోతకు వచ్చే నీలం, తోతాపురి రకాల్లోనూ, నీలేషాన్ సంకరంలోనూ ఈ ఈగలబెడద ఎక్కువ ఉంటుంది.
నివారణ:
- కాయలు తయారయ్యే సమయంలో ప్రతి 5 మామిడి చెట్లకు ఒక కాయ కొట్టే ఈగ ట్రాప్స్ అమర్చాలి. తోటలోని ఈగలు ఈ ఎరకు ఆకర్షించ బడతాయి.
- ఈగ ఆశించి రాలిన కాయల్ని పోగుచేసి తోటకు దూరంగా నాశనం చేయాలి.
- పొలాన్ని శుభ్రంగా ఉంచాలి.
కాండం తొలుచు పురుగు
లక్షణాలు :
ఈ పురుగు సాధారణంగా పాత తోటల్లో, నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటి లద్దె పురుగులు కాండాన్ని, కొమ్మని తొలిచి తినేస్తాయి. తద్వారా చెట్లు బలహీనమవుతాయి. కొమ్మలు ఎండి పోతాయి. చెట్లు చనిపోతాయి.
నివారణ:
- చెట్టుకు రంధ్రాలు చేసిన కన్నంలోని పురుగులను సన్నని ఊచతో తీసేయాలి. వాటిని నాశనం చెయ్యాలి.
- రంధ్రం చుట్టూ ఉన్న వ్యర్ధ పదార్థాలను బాగా శుభ్రం చేసి, వేపనూనెలో ముంచిన దూదిని కన్నాల్లోకి పెట్టి పైన బంక మట్టితో మూసి వేయాలి.
- తోటలో పూర్తిగా ఎండిపోయిన చెట్లను, కొమ్మను ఎప్పటికప్పుడు తొలగించి, పొలాన్ని శుభ్రంగా ఉంచాలి.
మామిడిని ఆశించే తెగుళ్ళు – నివారణ
బూడిద తెగులు (పౌడరీ మిల్ డ్ల్యూ)
లక్షణాలు :
కాడలపై, పూల మీద, చిరుపిందెల మీద తెల్లని పౌడరు లాంటి బూజు ఏర్పడుతుంది. ఈ బూజు వల్ల పూు, పిందొ వడలిపోయి రాలిపోతాయి. పంటకు నష్టం కుగుతుంది.
నివారణ:
- పూత, మొగ్గులు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- శొంఠిపాల కషాయం కూడా ఒకసారి పిచికారీ చేయవచ్చు.
ఆకుమచ్చ తెగులు
లక్షణాలు :
ఈ తెగులు కొల్లోటోట్రైకం అనే బూజు (శిలీంధ్రం) వల్ల వస్తుంది. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చు ఏర్పడి క్రమంగా మచ్చలు కలిసిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. లేత రెమ్మలపై నల్ల మచ్చులు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. తెగులు సోకిన కాయల పై న్లటి గుంత మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి.
నివారణ:
- పూత దశకు ముందే ఎండిన కొమ్మలను తీసివేసి వాటిని నాశనం చేయాలి.
- బోర్దో మిశ్రమం 1 శాతం లేదా 3 గ్రాముల కాపర్ అక్సీక్లోరైడ్ చెట్లపై పిచికారీ చేయాలి.
- బాగా పులిసిన పుల్లని మజ్జిగ 6 లీటర్లు + 100 గ్రాముల ఇంగువ, 100 లీటర్ల నీటిలో కలిపి చెట్లపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మసి తెగులు (సూటీ మోల్డ్)
లక్షణాలు :
ఈ తెగులు ‘క్యాప్నోడియం’ అనే శిలీంద్రం ద్వారా వస్తుంది. రసం పీల్చే తేనెమంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్థం ఆకుల మీద పిందెలు, కాయల మీద పడి నల్లని మసిలా పెరుగుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. కాయసైజు తగ్గిపోయి, రాలిపోతాయి.
నివారణ:
- రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం (లేదా) నీమాస్త్రం ఉపయోగించి అరికట్టాలి.
- 2 కిలోల గంజి పొడిని (స్టార్చి) 5 లీటర్ల వేడి నీటిలో కలిపి, దీనికి 100 లీటర్ల నీటిని చేర్చి గంజి ద్రావణం తయారు చేయాలి. గంజి ద్రావణాన్ని మసి తెగులు సోకిన చెట్ల కొమ్మలకు, ఆకులపై, కాయలపై బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి.
- పశువుల పేడ + మూత్రం ద్రావణం 2 సార్లు 10 రోజుల వ్యవధిలో తెగులు సోకిన భాగాలపై పిచికారీ చేయాలి.
- ఈ విధంగా చేయటం వల్ల మసి తెగులు చిన్న చిన్న పెళ్ళఆలుగా గంజి పొడితో కలిసి ఎండకు ఎండి రాలిపోతుంది. పంట ఆరోగ్యంగా ఉంటుంది.