పురుగులలో తెగుళ్లు
పురుగులలో తెగుళ్లు
బూజు తెగులు: పురుగు శరీరమంతా విపరీతంగా బూజు పెరిగి తెల్లగా సుద్దముక్కల్లా గట్టిగా అయిపోతాయి. పెంకుజాతి పురుగులపై మెటారైజియం, గొంగళి పురుగులపై బవేరియా, నొమూరియా తెగుళ్లు వస్తాయి.
వైైరస్ తెగులు: వైరస్ తెగులు సోకిన పురుగు మొక్కపైకి ఎక్కి తల క్రిందులుగా వేలాడుతూ చనిపోతుంది. శరీరమంతా ద్రవంగా మారిపోతుంది. పచ్చపురుగు, లద్దెపురుగులలో ఎన్పివి రోగాన్ని కలిగిస్తే, చెరకు కాండం తొలుచు పురుగులలో జివి వైరస్ రోగాన్ని కలిగిస్తుంది.