దొంగ ఈగ
దొంగ ఈగ
ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు ఇతర పురుగులను ఎగురుతూ పట్టి తింటుంది. పిల్ల పురుగులు నేలలో జీవిస్తూ ఇతర పురుగులను తింటాయి.
పురుగుల అదుపు : రెక్కల పురుగు, పచ్చదోమ, ఈగలు మరియు కందిరీగలు.
జీవిత దశలు తల్లి పురుగు తూనీగలను పోలి పొట్ట లావుగా, ఒక జత రెక్కలు కలిగి ఉంటుంది. గాలిలో పురుగులను లాఘవంగా పట్టి రసంపీల్చి తింటుంది. లార్వా దశలో మట్టిలో, ఎండిపోయి కుళ్లుతున్న చెట్టు మొదళ్ళ కింద పురుగులను తింటాయి. అక్కడే నిద్రావస్థలోనికి వెళతాయి.