టాకినిడ్ ఈగ
టాకినిడ్ ఈగ
ఆహారపు అలవాట్లు : తల్లి ఈగలు పూలలోని తేనె, పుప్పొడి తిని జీవిస్తాయి. ఇతర దశలు చీడపురుగుల శరీరాలో తింటూ ఎదుగుతాయి.
పురుగుల అదుపు : పేనుబంక, కాయతొలుచు పురుగు, పచ్చదోమ, పొలుసుపురుగు.
జీవిత దశలు : తల్లి పురుగు ఈగను పోలి కొంచెం పెద్దదిగా నల్లని గోదుమ రంగు నుంచి కాంతివంతమైన రంగుల్లో వుంటుంది. ఇవి లార్వా శరీరంపై లేదా సమీపంలో ఆకులపై గుడ్లు పెట్టి, పురుగు కడుపులోకి వెళ్ళినాక అవి పొదిగి పురుగు శరీరంలో తింటూ నిద్రావస్థలోకి వెళతాయి. పురుగు శరీరంపై గుడ్లు పెడితే పిల్లపురుగు చీడపురుగు శరీరాలను తొలుచుకొని లోపలికి వెళతాయి. లార్వా పచ్చగా వుండి చీడపురుగు శరీరంలోపల తింటూ ఎదుగుతాయి. ఇవి నేలలో నిద్రావస్థలోనికి వెళతాయి. తల్లి ఈగ వాటి 2 నెలల జీవిత కాలంలో 1000-2000 గుడ్లను పెట్టగలవు. గుడ్డు అండాకృతిలో తెల్లగా వుంటాయి.
Tag:టాకినిడ్ ఈగ