గొల్లభామ
గొల్లభామ
ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని పురుగులను కొరికి తింటాయి.
పురుగుల అదుపు : పేనుబంక, పండ్ల ఈగలు, మిడతలు, గొంగళిపురుగులు.
జీవిత దశలు : తల్లి పురుగులు పరిసరాలలో కలిసిపోయే రంగు, ఆకృతులను కలిగి వుంటాయి. ఇవి చీడ పురుగులకు చలనం లేనట్లుగా భ్రమను కల్పిస్తూ నిరీక్షించి పట్టి తింటాయి. గుడ్లను గుంపులుగా నురుగలో కప్పి పెడతాయి. అది గట్టిపడి రక్షణ కవచంగా మారుతుంది. పిల్ల, తల్లి పురుగులు బలమైన ముళ్లు కలిగిన ముందుకాళ్ళతో శత్రుపురుగులను పట్టుకుని తింటాయి.
ఆడ మగ కలిసి సంపర్కం జరిగాక ఆడ పురుగు ఆకలిగా ఉంటే, అది మగదాన్ని తినేస్తుంది.