కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ – డాక్టర్ జి. వి. రామాంజనేయులు
కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’
రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన రెండు తొలుగు రాష్ట్రాలు ఈ రోజు వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పర్యావరణ సమస్యలు, పెరగని మద్ధతు ధరలు సంక్షోభానికి కారణం. మరోవైపు అవినీతి, విధానాల మార్పు, ప్రభుత్వ రంగ పరిశోధనాలు విస్తరణ చతికిపడటం వంటి కారణాల వలన బయట వనరులపై ఆధారపడి చేసే వ్యవసాయ పద్ధతులు, ప్రైవేట్ వ్యవస్థపై ఆధారపడటం ఎక్కువైంది. 80 శాతం చిన్న రైతులు (1 ఎకరం అంతకంటే తక్కువ) వున్నప్పటికీ పెద్ద కమతా వ్యవసాయ పద్ధతుల్ని ప్రవేశ పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల వలన నేడు పంటలు పండిం చటంలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్న స్థితిని మనం చూస్తున్నాం.
దీనికి మార్కెట్ వ్యవస్థలో వస్తున్న మార్పు, పరిశ్రమలకు ముడి సరుకు, వినియోగదారులకు ఆహారం తక్కువ ధరలకే అందించటానికి ప్రభుత్వం అవంభిస్తున్న పద్ధతు వలన వ్యవసాయం పూర్తిగా గిట్టుబాటు కాని పరిస్థితిలో వుంది.
ఈ నేపధ్యంలో స్థానిక వనరుల మీద అధారపడి చేసే సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవంబించి, ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన ఉత్పత్తులను సాధించే దిశగా అనేక ప్రయత్నాలు రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు మంచి ఫలితాలే ఇచ్చినప్పటికీ, ఎక్కువ స్థాయిలోకి వెళ్ళలేక పోతున్నాయి. ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సంస్థ నిర్లిప్తత, ప్రభుత్వ సహకారం లేకపోవటం వలన ఇవి రైతులకు అందుబాటులోకి రావటం లేదు, పైగా ప్రత్యామ్నాయా పేరుతో అనేక అనుభవాలు వింటున్నా, వాటి గురించి నేర్చుకోవటానికి కానీ, సమస్యలు ఎదుర్కొన్న సమయంలో పరిష్కారం పొందటానికి కానీ సరైన వ్యవస్థ లేకపోవటం వలన ఆసక్తి కలిగిన రైతులు కూడా ఈ పద్ధతులను అవంబించ లేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పునుకుల, ఎనబావి వంటి గ్రామాలతో పాటు అనేక వంద గ్రామాలు, వేల మంది రైతులు, మహిళా సంఘాల ద్వారా పురుగు మందు వినియోగం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతులతో లక్ష ఎకరాలలో సాగు జరగటానికి సహకారం అందించిన సుస్థిర వ్యవసాయం కేంద్రం నుంచి నెల నెలా సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించీ, రైతులు అనుకూల విధానాల మార్పు గురించి మీ అందరికీి అందుబాటులోకి తేవటానికి చిన్న ప్రయత్నంగా ప్రారంభం అవుతుంది ఈ ‘తొలకరి’.
ఈ ‘తొలకరి’ మీ అందరి సహకారంతో ఒక కొత్త వ్యవసాయానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నాం.
అయితే సహజ వ్యవసాయ పద్ధతుల అవలంబించి, రైతు పరస్పర సహకారంతో సంఘటితంగా చేసుకునే వ్యవసాయం పైనే దేశానికి, రైతులకు భవిష్యత్తు వుంటుందని అనేక అనుభవాలు చెపుతున్నాయి. అయితే ప్రభుత్వం అవంభించే విధానాలు, ఆలోచనాధోరణి ఇందుకు భిన్నంగా ఉంది. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయంపై ఉన్న చిన్న చూపుతో వారిని వ్యవసాయ రంగం నుండి తొగించడానికి ప్రతి ప్రభుత్వమూ దారులు వేస్తోంది. మరోవైపు చిన్న గ్రామాల నుండి దేశ రాజధానుల భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో రైతాంగ హక్కులను ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ హక్కులను నిర్వచించడంలోనూ, సాధించడంలోనూ ‘తొలకరి’ రైతులకు తోడుగా ఉంటుంది.
Tag:‘తొలకరి