అజోల్లా – సుస్థిర వ్యవసాయ కేంద్రం
ఇది సాధారణంగా బావులు, చెరువులు, కాలువలు, వరి పొలాల్లో నీటిపై తేలియాడుతూ కనిపించే పెర్నజాతి మొక్క. అది నత్రజనిని స్థిరీకరించే నీలి ఆకు పచ్చనాచు (అనాబినా)తో సహజీవనం సాగిస్తూ (అనాబినా, అజోల్లాగా), దాని నత్రజనిని ఉపయోగించుకుంటూ బాగా పెరిగి నేలలో కలసినప్పుడు 40-60 కిలోల నత్రజనిని వరి పైరుకు అందిస్తుంది.
వరి నాటిన వారం రోజుల్లో ఎకరాకు సుమారు 4 కిలోల అజోల్లా వేయాలి. 2-3 వారాలలో అది పెరిగి చాపవలే అల్లుకుంటుంది. కలుపు తీసే సమయంలో తొక్కడం వలన కొంత భాగం నేలలో కలిసిపోతుంది. లేదా పొలంలో నీటిని ఒకసారి పూర్తిగా తీసివేయడం వల్ల అజోల్లా నేలకు అంటుకుని కుళ్లిపోతుంది. తద్వారా నత్రజనే కాక సేంద్రియ పదార్థం కూడా నేలకు ఉపయోగపడుతుంది. ఒక వేళ అజోల్లాని వరి పొలాల్లో నాటటానికి ముందు వేస్తే ఇది 20 రోజులలో పెరిగి సుమారు 10 టన్నుల పచ్చిఆకు ఎరువు అందించి దాదాపు 30 కిలోల నత్రజనిని అందిస్తుంది.
- వరి పెరుగుటకు ఎలాంటి ఆటంకం ఉండదు.
- నీరు లేకపోయినా తడిగల బురదలో జీవించి ఉంటుంది.
Tag:అజోల్లా, వరి పొలాల్లో