వావిలాకు వావిలి ఆకులు వైద్య పరంగా ఉపయోగపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. వావిలాకు కషాయం కీటక నాశనిగా ఇటీవల కాలంలో రైతులు వాడుతున్నారు. వావిలాకులలో ఉన్న ”కాస్టిసిన్” అనే రసాయనం క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. వావిలాకులలో ”కాస్టిసిన్’తో పాటు ఇతర ముఖ్యమైన రసాయనాలు (క్రైసోఫినాల్, ఐసోఓరియంటిన్ మొ||) కూడా వున్నాయి. సంస్కృతంలో వావిలిని ”నిర్గుండి” అంటారు. …